సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశంలోని పనిచేస్తున్న నదీ యాజమాన్య బోర్డుల తరహాలోనే కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైంది. రెండు బోర్డుల కార్యాలయాల ఏర్పాటుకయ్యే ఖర్చును కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాలు భరించాలని, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని, నిధుల సమస్య రాని విధంగా తగిన ఏర్పాట్లు ఉండాలని పలువురు ఇంజనీర్లు సూచించారు. బోర్డుల స్వరూపం, పాలనకు సంబంధించిన విధివిధానాలను నిర్ణయించే కసరత్తులో భాగంగా సీడబ్ల్యూసీ శుక్రవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది.
సమావేశంలో వివిధ నదీ యాజమాన్య బోర్డుల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఇంజనీర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ పాల్గొన్నారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ‘‘కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో, గోదావరి బోర్డు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొత్త రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేవరకు.. రెండు బోర్డులు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయవచ్చు. రెండు బోర్డులు ఒకే ప్రాంగణంలో ఉండటం మంచిది’’ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు.
కార్యాలయాలు, సిబ్బంది, నిధులెలా?
Published Sat, Sep 13 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement
Advertisement