
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు కాకినాడ ఎన్నికల ప్రచార సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. మాతో పెట్టుకుంటే మీ హైదరాబాద్ బ్రాండ్ ఉండదు. ఎవరు కూడా అక్కడ ఉండరు. పారిపోయే పరిస్థితి వస్తుంది. అనవసరంగా పెట్టుకోకండి. నేనే డెవలప్ చేశా. నీ గొప్పేమీ కాదు దాంట్లో. నాదే గొప్ప. కానీ, ఉన్నపలంగా లాగేసుకున్నారు' అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకు హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడిన మాటలను చంద్రబాబు మాటలతో పోల్చుతూ ఉన్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లాంటి నగరం ఒక్క రోజులో నిర్మించింది కాదని, మహానగరంగా రూపాంతరం చెందడానికి ఎంతో సమయం పట్టిందని కేటీఆర్ చెప్పారు. ప్లాన్‌లు వేసుకుని బొమ్మలు గీసుకుని కట్టితే వచ్చే సీటీ కాదని, హైదరాబాద్ ఒక చారిత్రక, సాంస్కృతిక నగరమని పేర్కొన్నారు. ఒక నగరం మీద ఇద్దరు నాయకులకు ఉన్న అభిప్రాయం అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ఒక నగరం మీద ఇద్దరి నాయకులకు ఉన్న అభిప్రాయం..@ncbn vs @KTRTRS #Hyderabad pic.twitter.com/hWrS6e9LTr
— Jagan Reddy #MissionTRS16 (@jaganreddy85) 8 April 2019
Comments
Please login to add a commentAdd a comment