ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ, తెలంగాణపై విషం కక్కుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. పది జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినా ముఖ్యమంత్రి సమైక్య సీఏంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు కేబినేట్ ఆమోదం తర్వాత ప్రధానికి రాష్ట్ర విభజన చేయరాదని లేఖ రాయడం సిగ్గు చేటని పేర్కొన్నారు. తాము తెలంగాణకు అనుకూలమని చెబుతున్న టీ టీడీపీ నాయకు లు ఇప్పుడు బాబు లేఖకు ఏం సమాధానం చె బుతారని ప్రశ్నించారు. సీమాంధ్రులు ఎన్నికుట్రలు పన్నిన తెలంగాణను ఆపలేరని స్పష్టం చే శారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి, నాయకులు అడ్డిబోజారెడ్డి, మనోహర్,బండారి సతీశ్ పాల్గొన్నారు.
కిరణ్, చంద్రబాబు ఊసరవెల్లులు
Published Tue, Dec 10 2013 5:16 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement