'రాష్ట్రాన్ని హేతు బద్ధత లేకుండా విడదీసింది' | Chandrababu naidu takes on congress party in vizianagaram | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాన్ని హేతు బద్ధత లేకుండా విడదీసింది'

Published Wed, May 6 2015 4:45 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Chandrababu naidu takes on congress party in vizianagaram

విజయనగరం: కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విడదీసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. బుధవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో కొంత మంది ఆందోళన చేస్తున్నారు... వాళ్లను నేను సమర్థిస్తున్నాను అని అన్నారు.

అన్ని రాష్ట్రాలతో సమానస్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వడమే కాకుండా రాజధాని నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందజేసి ఆదుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement