
'ఎన్టీఆర్ యుగపురుషుడు.. ఆయనకు ఆయనే సాటి'
హైదరాబాద్: ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ యుగపురుషుడు... ఆయనుకు ఆయనే సాటి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా ఆయన సమాధి వద్ద చంద్రబాబు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
కిలో బియ్యం రూ. 2 ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్బంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా రాష్ట్రంలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్వార్డ్, స్మార్ట్ ఏపీ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చంద్రబాబు వివరించారు.