
ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం సమీక్షించారు.
ప్రధానితో పాటు 11 మంది ముఖ్యమంత్రులకు ఆహ్వానం
కేసీఆర్‌కు అభినందనలు.. ఆహ్వానం
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం సమీక్షించారు. ఆయన ఈ నెల 8వ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు విజయవాడ-గుంటూరు మధ్య నాగార్జున వర్సిటీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని తన నివాసంలో అధికార, అనధికార ప్రముఖులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ, తమిళనాడు, గోవా, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, నాగాలాండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఎన్‌డీఏలోని 29 భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
వీరితో పాటు కేంద్ర మంత్రులను, జాతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలను కూడా చంద్రబాబు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కాబోయే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా లేఖ ద్వారా ఆహ్వానిస్తామని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం బుధవారం తిరుపతిలో జరగనుంది. వెంకటేశ్వర వర్సిటీ ఆవరణలోని సెనేట్ హాల్‌లో జరిగే ఈ భేటీలో చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుంటారు. దీనికి ముందు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగే అవకాశం ఉంది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతల సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. పార్టీ కమిటీ ఏర్పాటు, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జన సమీకరణ తదితర అంశాలపై ఇందులో సమీక్షిస్తారు. 6న తెలంగాణ రాష్ట్ర నేతల భేటీ జరుగుతుంది. కాగా,లోకేశ్ కోసం ఎన్‌టీఆర్
ఎన్టీఆర్ భవన్‌లో ఉత్సవాలు
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం టీడీపీ నాయకులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు... తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ పార్టీ నేతలను ఆహ్వానించి ఉంటే గౌరవంగా ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, సీనియర్ నేతలు ఎర్రబెలి, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు హాజరయ్యారు.
కృష్ణయ్య దూరం: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకలకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరు కాలేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆహ్వానం మేరకు గచ్చిబౌలిలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లినట్లు కృష్ణయ్య ‘సాక్షి’కి తెలిపారు.