‘ఇప్పటిదాకా మనకు (తెలంగాణ) బాధ ఉండేది. ఇప్పుడు వాళ్లకు (సీమాంధ్రకు) బాధ ఉంటది. మనం అనుకున్నది సాధించినవాళ్లుగా హుందాగా వ్యవహరించాలి’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు.
‘ఇప్పటిదాకా మనకు (తెలంగాణ) బాధ ఉండేది. ఇప్పుడు వాళ్లకు (సీమాంధ్రకు) బాధ ఉంటది. మనం అనుకున్నది సాధించినవాళ్లుగా హుందాగా వ్యవహరించాలి’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా నిర్దేశించారు. ఇప్పటిదాకా పార్టీ అనుసరించిన వ్యూహానికి, ఇప్పటినుంచి అనుసరించబోయే దానికి చాలా తేడా ఉండాలని సూచించారు. నిన్నటిదాకా మనం కొట్లాడినట్టే ఇప్పుడు వాళ్లు(సీమాంధ్ర ఎమ్మెల్యేలు) కొట్లాడుతారని కేసీఆర్ విశ్లేషించారు.