ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తడంతో.. వీఐపీ క్యూ లైన్లో ఓ చిన్నారి స్పృహతప్పింది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భారీగా అనధికార వీఐపీలు పోటెత్తారు. ఆసహనానికి గురైన ఆలయ ఈవో వేణు వీఐపీ క్యూలైన్ గేట్లకు తాళాలు వేశాడు. ఇదే సమయంలో మచిలీపట్నం ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ(8) స్పృహతప్పింది. ఆమెను వెంటనే ప్రధమ చికిత్సాకేంద్రానికి తరలించారు.
ఈవో చర్య వల్ల అర్చకులు సైతం గేట్లు దూకి గర్భగుడిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈవో తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నానికి 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.100, రూ.250 టికెట్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.