
సాక్షి, కాకినాడ : సోదరుడి మరణంతో విషాదంలో ఉన్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పరామర్శించారు. మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కురసాల సురేష్‌బాబు (46) ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. విజయవాడలో బుధవారం రాత్రి అకస్మాతుగా గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు. దీంతో శోకసంద్రంలో మునిగిపోయిన కురసాల కన్నబాబు కుటుంబాన్ని చిరంజీవి పరామర్శించారు. కాకినాడలోని కన్నబాబు నివాసానికి వెళ్లి.. వారిని ఓదార్చారు.
(చదవండి: శోక సంద్రం.. కన్నబాబు నివాసం)
Comments
Please login to add a commentAdd a comment