సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో బోటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై సోమవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ప్రమాదంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రివర్ బే బోటింగ్ అండ్ అడ్వంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు బోటు నడపడానికి అనుమతి లేదని, భవానీద్వీపం నుంచి పవిత్ర సంగమం (ఫెర్రీ ఘాట్) వరకూ అనధికారికంగా తిప్పుతున్నా రని చెప్పారు. డ్రైవర్‌కు అనుభవం లేకపోవ డం, డబ్బులకు కక్కుర్తి పడి సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే బోటు బోల్తా పడిందన్నారు. విహారయాత్రకు వచ్చిన 19 (సాయంత్రానికి 21 మంది) మంది మరణించడం బాధాకరమన్నారు.
బోటు నిర్వాహకులపై క్రిమినల్ కేసు పెట్టా మని, ఈ వ్యవహారంలో పర్యాటక శాఖ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవి ష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జర గకుండా చర్యలు తీసుకునేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, నిపుణులతో ఓ కమిటీ వేస్తామ న్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 20 మంది ప్రయాణించే బోటులో సిబ్బందితో పాటు 45 మందిని ఎక్కించారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురిలో ఇద్దరిని డిశ్చార్జి చేశారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నా రని చెప్పారు. బోటు సిబ్బందిలో ముగ్గురు గల్లంతయ్యారని.. ఇందులో ఒకరు మరణిం చారని, ఇద్దరి కోసం గాలిస్తున్నారని చెప్పా రు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. పది లక్షల పరి హారం ఇస్తామన్నారు.
ప్రమాదస్థలాన్ని సందర్శించిన సీఎం
బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు సోమవారం సందర్శించారు. ప్రమాదంలో గాయపడి భవానీపురంలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ప్రమాదాలు జరక్కుండా చూస్తాం
Published Mon, Nov 13 2017 2:02 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment