సాక్షి, అమరావతి : కుటుంబ సర్వే ద్వారా కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన వారికి ముందుగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఏయిమ్స్ వైద్యులతో మాట్లాడి వైరస్ సోకిన వారికి అత్యుత్తమ వైద్య విధానాలను అందించాలని సూచించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 నియంత్రణలు అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.
(చదవండి : లాక్‌డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్)
కరోనా నేపథ్యంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మరోసారి అధికారులను ఆదేశించారు. ఎవరైనా రేషన్ అడిగితే వారికి ఇబ్బంది ఉందని గ్రహించి వెంటనే పరిశీలన చేసి బియ్యం అదించాలన్నారు. విపత్తు నేపథ్యంలో దేన్నైనా ప్రజలకు ఇచ్చే కోణంలోనే అధికారులు ఆలోచన చేయాలని సూచించారు. అలాగే రేషన్ ఇచ్చిన వారందరికీ రూ. వయ్యి ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం కార్డులు లేకుండా రేషన్ అడుగుతున్న వారితో ధరఖాస్తులు చేయించాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment