
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లుపై రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లుపై రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఆదివారం 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు అసమగ్రంగా ఉందన్న విషయం అసెంబ్లీకి వచ్చిన రోజు కిరణ్ కుమార్ రెడ్డికి తెలిదా అని ప్రశ్నించారు. ఆయనేమన్నా కళ్లు మూసుకున్నారా అని ఎద్దేవా చేశారు.
బీజేపీపై నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ నేతృత్వంలో మతోన్మాద అరాచక శక్తులను బీజేపీ బలోపేతం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి పంపిన టి.బిల్లు సమగ్రం లేదని, అదంతా తప్పుల తడక అని సీఎం కిరణ్ నిన్న అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపాలని సభ నాయకుడిగా స్పీకర్కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిపై విధంగా స్పందించారు.