
సీఎంను బర్తరఫ్ చేయాలి: నారాయణ
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. విభజనపై తలెత్తిన ఆందోళనలు, భయాలను తొలగించి, అనుమానాలను నివృత్తి చేయాల్సిన సర్కారే వాటిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ కేంద్ర మంత్రులే సభ్యులుగా ఉన్న జీవోఎం ఎదుట ఆ పార్టీ రాష్ట్ర నేతలు భిన్న వాదనలు వినిపించడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. విభజన పూర్తిచేసే క్రమంలో రాయలసీమ అభివృద్ధికి మండలిని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.