అసెంబ్లీలో సీఎం, ఈటెల వాగ్వివాదం
శాసనసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అడ్వకేట్ జనరల్ పదవిలో తెలంగాణ వ్యక్తిని నియమించలేదని ఈటెల ప్రశ్నించారు. ఈటెల వ్యాఖ్యలపై సీఎం కిరణ్ స్పందించారు.
తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వారు సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్ పదవిలో ఎందుకు నియమించలేదని కిరణ్ ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన పీవీ నరసింహరావును ఈ ప్రాంతంలో ప్రధానిగా గెలిపిస్తారన్న నమ్మకం లేకే తమ ప్రాంతంలోని నంద్యాల నుంచి పోటీలోకి దింపామని సీఎం కిరణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.