కొర్రపాడు రోడ్డులోని టింబర్ డిపోలో పని చేస్తున్న నాయబ్స్రూల్(18) విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందాడు. ఉదయం పనిలోకి వచ్చిన అతను చెక్కలు కటింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది.
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: కొర్రపాడు రోడ్డులోని టింబర్ డిపోలో పని చేస్తున్న నాయబ్స్రూల్(18) విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందాడు. ఉదయం పనిలోకి వచ్చిన అతను చెక్కలు కటింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది.
దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివేకానందనగర్‌కు చెందిన నాయబ్స్రూల్ గత 8 నెలల నుంచి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లి కరిమున్ బోరున విలపించసాగింది.