ఉంటారా.. వెళ్తారా! | Collector Siddharth Jain on the transfer of Speculation | Sakshi
Sakshi News home page

ఉంటారా.. వెళ్తారా!

Published Sat, Jun 21 2014 3:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ఉంటారా.. వెళ్తారా! - Sakshi

ఉంటారా.. వెళ్తారా!

కలెక్టర్ సిద్ధార్థజైన్ బదిలీపై ఊహాగానాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కలెక్టర్ సిద్ధార్థజైన్ బదిలీపై ఊహాగానాలు ఊపందుకున్నారుు. అవినీతి మరకలేని అధికారిగా పేరొందినప్పటికీ.. జిల్లా అభివృద్ధిపై ఆయన పూర్తిస్థాయిలో తనదైన ముద్ర వేయలేకపోయారన్న వాదనలను ఎవరూ కొట్టివేయలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది జూలైలో కలెక్టర్‌గా జిల్లాకు వచ్చిన ఆయన విప త్తులు, వరుస ఎన్నికలలో తలవునకలయ్యూరు. దీనివల్ల జిల్లాలో పాలనా యుంత్రాంగాన్ని గాడిన పెట్టే సవుయుం దొరకలేదనే చెప్పాలి. పాలనావ్యవహారాలపై ఇప్పుడిప్పుడే పట్టు బిగిస్తున్న ఆయునను పాలకులు ఇక్కడే కొనసాగిస్తారా.. లేక బదిలీ చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయూంశమైంది.
 
తుపానులు.. ఉద్యమాలు.. ఎన్నికలు
కలెక్టర్‌గా సిద్ధార్థజైన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మూడు తుపానులు.. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు.. సమ్మెలు.. ఆ తరువాత వరుస ఎన్నికలు ముంచుకు రాగా, ప్రతికూల పరిస్థితులు నెలకొన్నారు. అరునా జిల్లాను అభివృద్ధి బాట పట్టించేం దుకు ఆయన తనవంతు కృషిచేశారు. అరుతే, పాలనపై పూర్తిస్థాయిలో పట్టు బిగించలేకపోయూరు. కొత్త ప్రభుత్వం కొలువుతీరడంతో ఇటీవలే పాలనా వ్యవహా రాలపై దృష్టి సారిస్తున్నారు.

అధికారులు ప్రజలతో నేరుగా వూట్లాడి సవుస్యల పరి ష్కారానికి కృషి చేసేలా ప్రతి సోవువారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని దిగువస్థారుుకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి ఏలూరు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని నిర్ణరుంచారు. జంగారెడ్డిగూడెం, నరసాపురం, కొవ్వూరు కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహణకు తేదీలు ఖరారు చేశారు. ఈ క్రవుంలోనే గత సోవువారం జంగారెడ్డిగూడెం వెళ్లి ప్రజావాణి నిర్వహిం చారు. సమీప గ్రావూల్లో ఆకస్మికంగా పర్యటించారు. మరోవైపు ‘సంకల్పం’ పేరిట జిల్లాలో ప్రాథమిక విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు.
 
నత్తనడకన సాగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులు జైన్ హయాంలోనే వేగవంతం అయ్యాయి. 2013కు ముందు నాలుగేళ్లలో రూ.120కోట్ల విలువైన పనులు జరగ్గా, ఈయన హయాంలో కేవలం 11నెలల కాలంలో రూ.వందకోట్ల విలువైన పనులు జరిగాయి. తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంత రైతులను ముంపు కష్టాల నుంచి గట్టెక్కిం చేందుకు ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు కరాటం కృష్ణమూర్తి రిజర్వాయర్ పనులు చేపట్టారు.
 
విమర్శలూ ఉన్నాయ్
ఇదంతా నాణేనికి ఓ వైపే.. వురోవైపు జైన్ వ్యవహార శైలిపై జిల్లాస్థారుు అధికారుల్లోనూ తీవ్రస్థారుులో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయూన్ని పైకి చెప్పుకోలేని స్థితిలో అధికారులు వుదనపడతున్నారు. సిబ్బంది,  కిందిస్థాయి అధికారులపై అనుమానంతో అన్నీ తన స్వీయ పర్యవేక్షణలోనే జరగాలన్న సిద్ధార్థజైన్ ధోరణి ఫలితంగానే జిల్లాలో పాలన అనుకున్న స్థారులో పరుగులు పెట్టడం లేదన్న వాదనలు ఉన్నారుు. తానొక్కడే నిజాయితీగా ఉన్నాననే భావనతో.. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిజాయితీని శంకిస్తూ ఫైళ్లపై సంతకాలు చేయకపోవడం వల్ల పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని అంటున్నారు.

చివరకు ఉద్యోగుల జీతాల బిల్లుల వుంజూరులోనూ తీవ్ర జాప్యం జరుగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పంచాయుతీ రాజ్ శాఖలో 79వుంది జూనియుర్ అసిస్టెంట్ల పదోన్నతుల వ్యవహారం కేవలం కలెక్టర్ వ్యవహార శైలి వల్లే అర్ధరాత్రి వరకు సాగిందన్న వాదనలు ఉన్నారుు. సమీక్షల పేరిట అర్ధరాత్రి వరకు అధికారులతో సవూవేశాలు నిర్వహించడంపైనా ఆయూ వర్గాలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఓ విభాగం సమీక్ష అర్ధరాత్రి 12.30 వరకు సాగడంతో ఆ శాఖలోని వుహిళా ఉద్యోగులు ఆవేదనకు గురయ్యూరు. ఇక గోప్యత పేరిట ప్రజలకు, మీడియూకు అందుబాటులో ఉండాల్సిన సవూచారాన్ని బయుటకు పొక్కనివ్వకుండా సిద్ధార్థజైన్ అనుసరిస్తున్న విధానాలు సైతం వివుర్శల పాలవుతున్నారు. ఇదిలాఉండగా, ఇటీవల సిద్ధార్థజైన్ వుఖ్యవుంత్రి చంద్రబాబునాయుడి ఇంటికి వెళ్లి ఆయనను కలసి వచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన బదిలీపై ఊహాగానాలు మొదలయ్యూరు. ఉద్యోగుల అసంతృప్తి మినహాయిస్తే అవినీతి మరకలేని అధికారిగా పేరున్న జైన్‌ను కొన్నాళ్లు ఇక్కడే కొనసాగిస్తే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జైన్‌ను పాలకులు ఇక్కడే కొనసాగిస్తారా.. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వారందరినీ మార్చే క్రమంలో భాగంగా ఆయనను కూడా వేరే చోటకు సాగనంపుతారా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement