
'పరిటాల' పేరుతో బెదిరిస్తే ఫిర్యాదు చేయండి
పరిటాల కుటుంబం పదిమందికి మేలు చేసేదే కాని ఎవరి దగ్గరా లాక్కొనేదికాదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు.
హైదరాబాద్: పరిటాల కుటుంబం పదిమందికి మేలు చేసేదే కాని ఎవరి దగ్గరా లాక్కొనేదికాదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. పరిటాల కుటుంబం పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే, నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో ధర్మవరంలో పరిటాల సునీత కొడుకు శ్రీరామ్ పేరు చెప్పి ఆగంతకులు ఓ న్యాయవాదిని ఇటీవల బెదిరించారు. డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల సునీత వివరణ ఇచ్చారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో 16 నుంచి 18 లక్షల వరకు బోగస్ కార్డులను గుర్తించామని సునీత చెప్పారు. మూడు లక్షల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు.