స్థిరంగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రస్తుతం బీహార్, జార్ఖండ్ దగ్గర్లో ఉందని, దీని ప్రభావం మనపై ఉండబోదని స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింతగా క్షీణించే అవకాశాలున్నట్టు పేర్కొంది. గతేడాది మాదిరే ఈసారి కూడా ఆగస్టు చివరి వారంలోను, సెప్టెంబర్‌లోను వర్షాలు బాగా కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం భారీ వర్షాలపై ఆశ లులేవని, ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినపుడు ఆయా ప్రాంతాల్లో సాయంత్రంపూట ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయంటున్నారు.