కానిస్టేబుల్పై ఎనుగుల దాడి
విజయనగరం: విజయనగరం జిల్లా సాలురు మండలం ఎరగడవలసలో ఎనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి గ్రామంలో ఎనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏనుగులను అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో కానిస్టేబుల్ పి.త్రినాథ్‌రావు కింద పడటంతో ఏనుగులు ఆయన మీద దాడి చేశాయి. కానిస్టేబుల్ కాలుపై ఏనుగు పాదం మోపడంతో ఆయన కాలు విరిగింది. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎనుగుల గుంపు గ్రామ పరిసరాల్లోనే సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.