వాహనంలో ఉన్నవారంతా సురక్షితంగా బయపటపడగా..కారు మాత్రం ధ్వంసమైంది. దీంతో బాధితులు తమకు జరిగిన నష్టాన్ని ముదిగుబ్బ పోలీస్‌స్టేష¯Œన్ కు ఫోన్ ద్వారా తెలియజేశారు. అయితే సమీపంలోని చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న హరిలాల్‌నాయక్ అనే కానిస్టేబుల్‌కు స్టేషన్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడి చేరుకుని పరిస్థితిని బాధితులతో అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన బత్తలపల్లి మండల టీడీపీ నాయకులు రామాపురం చెన్నకేశవులు, నల్లబోయనపల్లి ప్రభాకరరెడ్డి, బెస్త శంకర్‌లు మినీ వ్యా¯ŒS డ్రైవర్‌ను పంపించి వేయాలని కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారన్నారు.
స్టేష¯ŒSకు ఫిర్యాదు వచ్చిందని చెప్పబోయిన కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు గుద్దారు. డ్రైవర్ మావాడే.. ఏమైతుంది పో.. అంటూ దౌర్జన్యానికి దిగారు. విషయం తెలుసుకున్న మిగతా పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని సదరు నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. అప్పటికే సమాచారాన్ని తమ ముఖ్య నేతలకు చెప్పి వారిని అక్కడే వదిలేసేలా ఒత్తిడి తీసుకువచ్చారు.
ఈ విషయం ఆనోటా ఈనోటా పడి మీడియాకు తెలియడంతో పోలీస్ అధికారులను అడగ్గా.. ఏం లేదు.. చిన్న విషయమే సర్దుకుపోతుందని చెప్పారు. విషయం పెద్దదవుతుందని భావించిన టీడీపీ ముఖ్యనాయకులు, కేసు పెట్టకుండా బాధిత కానిస్టేబుల్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. మీడియాలో స్క్రోలింగ్‌లు, బ్రేకింగ్‌లు రావడంతో చేసేది లేక దాడికి పాల్పడిన ముగ్గురు టీడీపీ నాయకులపై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు.