సాక్షి, నంద్యాల : ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ చేస్తున్న ఆందోళనకారులను కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వారిపై దౌర్జన్యం చేశారు. మహిళల పట్ల నంద్యాల డీఎస్పీ దురుసుగా వ్యవహరించారు. మహిళా పోలీసులు లేకుండానే మహిళలను ఇష్టానుసారంగా లాగి పడేశారు. గాయాలయి రక్తమోడుతున్నా పోలీసులు పట్టించుకోకుండా అమానవీయంగా ప్రవర్తించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కొంతమందిని గృహనిర్బంధంలో ఉంచారు. బంద్‌లో పాల్గొన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్‌కు ఏపీయుడబ్ల్యూజే సంఘీభావం తెలిపింది. హోదా పోరుపై టీడీపీ ప్రభుత్వ వైఖరిని జర్నలిస్ట్ సంఘాల నేతలు ఖండించారు. పార్టీలకు అతీతంగా హోదా ఉద్యమంలో పాల్గొంటామని, సాధించే వరకు ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల అక్రమ అరెస్టులను జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి.
ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఆళ్ళగడ్డ వైఎస్సార్ సీపీ ఇంఛార్జి గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి ఆధర్వంలో బంద్ చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం ఎస్కార్ట్ సహాయంతో బస్సులు తిప్పుతోంది.
నందికొట్కూరులో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే ఐజయ్య, సిద్దార్థ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల జులుం నశించాలని వైఎస్సార్ సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
సంబంధిత కథనాలు
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న బంద్
Comments
Please login to add a commentAdd a comment