ఎన్నారైలో కోవిడ్–19 ఆస్పత్రిని పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, జేసీ దినేష్‌కుమార్
సాక్షి, గుంటూరు: జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడా జనసంచారం లేకపోవడంతో బోసిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతండటంతో అధికారులు కఠిన ఆంక్షల దిశగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జిల్లా వ్యాప్తంగా విధించిన సంపూర్ణ లాక్‌డౌన్ విజయవంతమైంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు మంగళగిరి ఎన్నారైలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిని కరోనా ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్, కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, జేసీ దినేష్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. అంతకుమందు జిల్లాలోని లాక్‌డౌన్ పరిస్థితిని గుంటూరు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు.
బయటకొస్తే అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి!
గుంటూరు నగరంతోపాటు, జిల్లా ప్రధాన ప్రాంతాలను పోలీసుల దిగ్బంధించారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు బయటకు వచ్చేవారు సైతం అడ్రస్ ప్రూఫ్ తప్పకుండా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి నుంచి ఒక్క కిలోమీటరు దూరం వరకే అనుమతిస్తున్నారు. హద్దు దాటితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలను వీలైనంత ఎక్కువగా ఇంటిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో నగర కమిషనర్ చల్లా అనురాధ పరిశుద్ధ్య పనులను ముమ్మరం చేయించారు.
కరోనా మృతుడికి అంత్యక్రియలు
దాచేపల్లి మండలానికి చెందిన వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. అధికారులు కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇచ్చినా.. ఎవరూ మృతుడిని చూసేందుకు రాలేదు. కుటుంబ సభ్యుల్లో చాలా మంది క్వారంటైన్‌లో ఉండటంతో అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం శ్మశానవాటికలో దహన సంస్కారం చేశారు. కొరిటెపాడులో ఖననం చేసేందుకు అక్కడి ప్రజలు అభ్యంతరం చెప్పడంతో స్థంభాలగరువులో కార్యక్రమం నిర్వహించారు.
కరోనాను జయించి..
గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, అతని భార్యకు తొలుత కరోనా వ్యాధి సోకింది. వారు విజయవాడలోని కోవిడ్–19 ప్రత్యేక విభాగంలో వైద్య చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. వారికి రెండు సార్లు పరీక్ష చేస్తే నెగిటివ్ రావడంతో వైద్యులు ఆదివారం డిశ్చార్జి చేశారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, అతని భార్యకు తొలుత కరోనా వ్యాధి సోకింది. వారు విజయవాడలోని కోవిడ్–19 ప్రత్యేక విభాగంలో వైద్య చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. వారికి రెండు సార్లు పరీక్ష చేస్తే నెగిటివ్ రావడంతో వైద్యులు ఆదివారం డిశ్చార్జి చేశారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఏడు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరింది. నమోదైన ఏడు కొత్త కేసుల్లో ఆరు కేసులు గుంటూరు నగరంలో ఉండటం, కేసుల సంఖ్య 63కు చేరడం కలవరపెడుతోంది. ఆనందపేటలో నాలుగు, పొన్నూరు 60 అడుగులరోడ్డు ప్రాంతంలో ఒకటి, కొరిటెపాడులో ఒక కేసు, మరో కేసు పొన్నూరులో నమోదైంది. ఈ నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేయనున్నారు.
జిల్లాలో రోజుకు 800 మందికి కరోనా అనుమానితులకు టెస్టులు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం 20 ప్రత్యేక బృందాలను నియమించారు. వీరు క్వారంటైన్ సెంటర్లు, కంటైన్మెంట్ జోన్‌లో శాపిళ్లు తీసి పరీక్షలు చేయనున్నారు. ఒక్కో కంటైన్మెంట్ జోన్‌లో ర్యాపిడ్‌గా వెయ్యి మందికి కరోనా పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment