గిరిజన మహిళనైన నన్ను బాధపెట్టారు: వైరా ఎమ్మెల్యే
ఖమ్మం: సీపీఐపై వైరా ఎమ్మెల్యే చంద్రావతి లేఖాస్త్రం సంధించారు. గత కొద్దిరోజులుగా చంద్రావతి సీపీఐని వీడుతున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో లేఖాస్త్రం సంధించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
గిరిజన మహిళనైన నన్ను బాధపెట్టారు. అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేశారు. పార్టీలో గిరిజన ప్రజాప్రతినిధులకు సమస్యలు సృష్టించి బయటకు గెంటేస్తున్నారు అని చంద్రావతి లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సీటు వేరే అభ్యర్ధికి ఇస్తామన్న విషయంలో కనీసం నా అభిప్రాయం కూడా తీసుకోలేదని, సీపీఐ వల్ల ఆర్ధికంగా నష్టపోయానని లేఖలో తెలిపారు. అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని చంద్రావతి తెలిపారు. ఎప్పటికీ పార్టీ సీపీఐలోనే ఉంటానని చంద్రావతి స్పష్టం చేశారు.