
'బీజేపీతో బాబుది అక్రమ సంబంధం'
విశాఖ : భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు అక్రమ సంబంధం పెట్టుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. దీనిపై నారాయణ పైవిధంగా స్పందించారు.
కేంద్రం అసమర్థల వల్లే రాష్ట్రంలో పరిపాలన దెబ్బతిందని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం త్రిశంకుస్వర్గంలో ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాతే పార్టీలతో పొత్తు ఉంటుందని, లేదంటే ఒంటరి పోరు తప్పదని ఆయన అన్నారు.