
బడ్జెట్ అంతా అంకెల గారడి: రామకృష్ణ
కడప: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి జరిగితే.. వలసలు ఎందుకు ఆగడంలేదని, 950 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్ జిల్లాలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రామకృష్ణ.. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పూర్తిగా వాడలేదని అన్నారు. గత ఏడాది కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.