వెఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన క్రికెట్ బెట్టింగ్ వీరుడు మునిస్వామిని నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు.
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: వెఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన క్రికెట్ బెట్టింగ్ వీరుడు మునిస్వామిని నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. లక్ష స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ బాలిరెడ్డి, ఎస్‌ఐ రాము బుధవారం విలేకరులకు తెలిపారు.
వ్యవసాయం చేసుకుంటున్న ప్రొద్దుటూరు తాలూకా ఖాదర్‌బాద్ మజరా గ్రామం కొత్తపల్లెకు చెందిన మనిస్వామి ఆరు నెలల క్రితం క్రికెట్ బెట్టింగ్ మొదలెట్టాడు. నంద్యాలకు చెందిన లక్ష్మికాంత్‌తో కలిసి బెట్టింగ్ చేసేవాడు. బెట్టింగ్ డబ్బు ఇచ్చేందుకు వచ్చిన మునిస్వామిని స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండు గుడిసెలు దగ్ధం
నంద్యాల సుందరయ్య నగర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించిం రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. విద్యుదాఘాతం కారణంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో గుడిసెల్లో ఉన్న తిండి గింజలు, సామగ్రి కాలిపోయిదని బాధితులు వాపోయారు.