నెల్లూరు జిల్లాలో రేషన్ పంపిణీల్లో అక్రమాలకు పాల్పడిన ఏడుగురు డీలర్లపై క్రిమినల్ కేసుల నమోదుకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రేషన్ పంపిణీల్లో అక్రమాలకు పాల్పడిన డీలర్లపై క్రిమినల్ కేసుల నమోదుకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. జేసీ ఇంతియాజ్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించగా, నెల్లూరు నగరంలోని ఏడుగురు డీలర్లు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. దీంతో వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు తహశీల్దార్లను ఆదేశిస్తూ పౌరసరఫరాల శాఖ అధికారి ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.