కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌ృలెన్ : తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ , ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, రాష్ట్ర పునర్నిర్మాణంలో సైతం ఉద్యోగుల పాత్ర కీలకం కావాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో 2014 సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను నారదాసు ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ... సంపూర్ణ తెలంగాణ సాధించేవరకూ ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు సీమాంధ్ర నేతల ఎత్తుగడలను ఛేదించి లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకూ సంయమనం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమళ్ల అంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి వంగపెల్లి రాజేశ్వర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రత్నాకర్‌రెడ్డి, నీలం శ్రీనివాస్, కళ్లెం వాసుదేవరెడ్డి, సతీశ్, చంద్రశేఖర్, కె.గంగాధర్, సుధాకర్, రమేశ్, వెంకట్‌రెడ్డి, సుమలత, నీరజ, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలో ఉద్యోగుల పాత్రే కీలకం
Published Mon, Jan 6 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement