సికింద్రాబాద్ : హెలెన్ తుపాను ప్రభావం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక ఇంజనీర్ల బృందంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ..... ఈరోజు ఉదయం విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఈలాగే సికింద్రాబాద్ రైల్ నిలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం అందిస్తోంది. తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ .... అధికారులను ఆదేశించారు.