డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్ : డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇక రాయల తెలంగాణ అంశంపై అధిష్టానం పిలుపు మేరకు రెండు రోజుల క్రితం హస్తిన వెళ్లిన దామోదర ఆ మేరకు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం దామోదర మరోసారి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కాగా ఆయన పర్యటన వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు.
రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని దామోదర స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ కల సాకారం కాబోతుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ నేతలకు, రాయల తెలంగాణ ప్రతిపాదన కలవరం కలిగిస్తోంది. రాయల తెలంగాణ కేవలం మీడియా ప్రచారం మాత్రమేనని ఒకవైపు ఖండిస్తూనే, మరోవైపు కలవరపడుతున్నారు.