చంద్రబాబు - ఓ పిచ్చోడి కథ | Deshapathi Srinivas Narrates Chandrababu-Mad Man Story | Sakshi
Sakshi News home page

చంద్రబాబు - ఓ పిచ్చోడి కథ

Published Mon, Sep 30 2013 10:32 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

చంద్రబాబు - ఓ పిచ్చోడి కథ - Sakshi

చంద్రబాబు - ఓ పిచ్చోడి కథ

హైదరాబాద్: నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం జరిగిన సకల జనభేరి సభలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ తన ప్రసంగంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి చెప్పిన కథకు సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.

‘‘ప్రస్తుతం ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు అటూ, ఇటూ తిరుగుతూ ఒక పిచ్చోడికి తారసపడ్డారట. చంద్రబాబును చూసి నువ్వు ఎవ్వరివి అని ఓ పిచ్చోడు ప్రశ్నించగా.. నేను చంద్రబాబునని బదులిచ్చాడు. ఏ చంద్రబాబువి అని పిచ్చోడు తిరిగి ప్రశ్నిస్తే ‘అదే, హైదరాబాద్‌ కట్టిన చంద్రబాబునని’ చెప్పాడట.

చంద్రబాబు మాటలు విన్న పిచ్చోడు.. ‘ఆహా! త్వరలోనే తగ్గిపోతుంది. నేను కూడా కొద్దిరోజుల క్రితం వరకు ఢిల్లీ గురించి ఇట్లానే చెప్పేవాడిని’ అన్నాడట’’ అని దేశపతి చెప్పడంతో సభ చప్పట్లతో మారుమోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement