
కాంగ్రెస్ పార్టీకి ధర్మాన రాజీనామా
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు.
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. తనను అక్రమంగా కేసులలో ఇరికించడమే కాక, ఇతర మంత్రుల విషయంలో ఒకలా, తన విషయంలో ఒకలా ప్రవర్తించినందుకు ఆయన నొచ్చుకున్న విషయం తెలిసిందే.
దీంతో ఇక తాను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనంటూ ముందే ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఆదివారం నాడు పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.