
సాక్షి, అమరావతి : తమకు కేటాయించిన కూరగాయల దుకాణాలను రద్దు చేయవద‍్దని కోరుతూ ముఖ‍్యమంత్రి చంద్రబాబు నివాసం వద‍్ద విజయవాడకు చెందిన దివ్యాంగులు సోమవారం ఉదయం ధర్నా చేశారు. తమ బాధలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వాలని వారు ముఖ‍్యమంత్రిని కోరారు. విజయవాడలోని రైతుబజార్‌లో ఎన్నో సంవత‍్సరాలుగా తాము నిర‍్వహిస్తున‍్న దుకాణాలు తొలగించి అధికార పార్టీవారికి కేటాయిస్తున్నారన్న సమాచారంతో... దీనివల‍్ల తాము బతుకుతెరువు కోల్పోతామని దివ్యాంగులు ఆందోళన వ‍్యక‍్తం చేశారు.
తమ బాధలు చెప్పుకుందామని ఎంతో ఆశతో వస్తే తమ గోడు వినేందుకు ముఖ‍్యమంత్రి సమయం ఇవ‍్వకపోవడంతో వారు ఆగ్రహం వ‍్యక‍్తం చేశారు. ఎన్నో సంవత‍్సరాలుగా నిర‍్వహించుకుంటున‍్న షాపులను తొలగిస్తే తమ కుటుంబాలు వీధిన పడతాయని వారు ఆవేదన చెందారు. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన‍్నవించినా ప్రయోజనం లేకపోయిందని దివ్యాంగులు వాపోయారు. ఇప‍్పటికైనా ముఖ‍్యమంత్రి స‍్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment