అవిశ్వాసం ప్రకటించినవారికి దిగ్విజయ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చిన వారు ఉపసంహరిచుకోవాలని, లేకుంటే పార్లమెంటరీ పద్ధతులు అనుసరిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్లు అవిశ్వాసం ప్రకటించిన విషయం తెలిసిందే.అందరిని సంప్రదించిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు- 2013 (తెలంగాణ బిల్లు) పై చర్చించి అసెంబ్లీ తన అభిప్రాయాలు చెబుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న తెలంగాణ బిల్లు రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది.