ఆంధ్రప్రదేశలోని శేషాచలం అడవుల్లో ఇటీవల పోలీసుల చేతుల్లో 20 మంది ఎర్ర చందనం కూలీల కాల్చివేత ఘటనపై చర్చించాలని శుక్రవారం రాజ్యసభలో సీపీఐ సభ్యుడు డీ రాజా డిమాండ్ చేశారు.
రాజ్యసభలో సీపీఐ డిమాండ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశలోని శేషాచలం అడవుల్లో ఇటీవల పోలీసుల చేతుల్లో 20 మంది ఎర్ర చందనం కూలీల కాల్చివేత ఘటనపై చర్చించాలని శుక్రవారం రాజ్యసభలో సీపీఐ సభ్యుడు డీ రాజా డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే.. సభావ్యవహారాలను రద్దు చేసి ఏపీలో 20 మంది కూలీల దారుణ హత్యపై తక్షణమే చర్చించాలని 267 నిబంధన కింద నోటీసు ఇచ్చినట్లు రాజా సభాధ్యక్ష స్థానంలో ఉన్న డెప్యూటీ చైర్మన్ పీజే కురియన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సావధాన తీర్మానం ఇస్తే పరిశీలిస్తానంటూ కురియన్ స్పందించారు.