పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సమావేశం రసాభాస! | Dispute on Change of University name | Sakshi
Sakshi News home page

పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సమావేశం రసాభాస!

Published Sat, Dec 13 2014 5:33 PM | Last Updated on Tue, May 29 2018 7:18 PM

పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సమావేశం రసాభాస! - Sakshi

పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ సమావేశం రసాభాస!

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సమావేశం రసాభాసైంది.   తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం పేరుని మార్చాలని టీడీపీ సభ్యులు తీర్మానించారు. డీసీసీబి చైర్మన్ వెంకటరత్నం దానిని వ్యతిరేకించారు. టీడీపి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కె.ఎస్.జవహర్ అతనిని అడ్డుకున్నారు. మెజార్టీ సభ్యులు తమవైపు ఉన్నారని, యూనివర్సిటీ పేరు మారుస్తామని వారు అన్నారు.

ఈ విశ్వవిద్యాలయం ఇక్కడకు రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్  ఎంతో కృషి చేశారని, ఆయన హయాంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని,  జిల్లాలో ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నారని వెంకటరత్నం వివరించారు. అటువంటి వ్యక్తి పేరుని తొలగించాలని నిర్ణయించడం తగదని ఆయన వాదించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement