సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలు
తాడేపల్లిగూడెం: ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా పోషకాహార భద్రత లభిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ‘ట్రైబల్ హార్టికల్చర్’ (గిరిజన ఉద్యాన పంటలు) అనే అంశంపై రెండు రోజులు నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సు సోమవారం ప్రారంభమైంది.
ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు అ«ధిక రాబడులు పొందే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ తోలేటి జానకీరామ్ మాట్లాడుతూ.. మన దేశంలో ఉద్యాన పరిశ్రమ 320 మిలియన్ టన్నుల ఉత్పత్తితో స్థూల జాతీయోత్పత్తిలో 33 శాతంగా ఉందన్నారు.
కేంద్రీయ ఉష్ణ మండల ఉద్యాన పంటల కేంద్రం (లక్నో) డైరెక్టర్ డాక్టర్ హెచ్‌ఎస్ సింగ్ వర్చువల్‌గా గిరిజన ప్రాంతాల్లో లాభసాటిగా ఉద్యాన పంటల సాగుపై వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు సమర్పించిన 102 పరిశోధన పత్రాలపై ఈ సదస్సులో చర్చించారు. భారతీయ ఆయిల్‌ఫామ్ పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆర్‌కే మాధుర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment