సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది. 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న పొర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు. (కోస్తా, రాయలసీమకు వర్ష సూచన)
తూర్పుగోదావరి: జిల్లాలో సోమవారం తెల్లవారు జాము నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. జిల్లావ్యాప్తంగా ఆరున్నర లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వేలిముద్రలు పడకపోయిన ఫేస్ ఇండెక్స్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.
పశ్చిమగోదావరి: జిల్లాలో ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటివద్దకే వాలంటీర్లు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4,75,140 మంది లబ్ధిదారులకు 116.37 లక్షల నగదు పంపిణీ జరుగుతుంది. దెందులూరు నియోజకవర్గం పాలగూడెంలో జరుగుతున్న పింఛన్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment