సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ తీరం చిత్రమిది.. చాలామంది వైజాగ్ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్ డెస్టినీ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం. అంతేకాదు.. అత్యధికమంది అంతర్జాతీయ ఉద్యోగులున్న హెచ్‌ఎస్‌బీసీ విశాఖలో ఉంది. కరోనా కారణంగా మూడు నెలలుగా ఈ సుందరమైన నగరాన్ని చాలా మిస్ అవుతున్నాను’ అంటూ తెలుగు రాష్ట్రాల యూఎస్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. వైజాగ్ లాంటి సుందర ప్రదేశం ఎక్కడా లేదనీ.. విశాఖ నగరంలో ఉన్న రోడ్లు దేశంలో ఎక్కడా కనిపించవని.. గతంలోనూ పలు ట్వీట్లు చేశారు. తాజాగా.. విశాఖని మిస్ అవుతున్నానంటూ.. ఏరియల్‌వ్యూ ఫొటోతో ఫ్లెమింగ్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు లైక్‌లు.. రీట్వీట్లు చేస్తున్నారు.
As we continue to move #AroundAndhra here is a view of the coastal court of #Visakhapatnam, known by many as #Vizag and dubbed The City of Destiny. It is the largest city in AP, and the biggest international employer is 🇬🇧- @HSBC. I am much missing my visits these past 3 months. pic.twitter.com/yupU1Kop8n
— Dr Andrew Fleming (@Andrew007Uk) July 5, 2020
Comments
Please login to add a commentAdd a comment