శ్రీకాళహస్తిలోని గాంధీ రోడ్డులో మద్యం మత్తులో మంగళవారం ఓ యువకుడు వీరంగం సృష్టించాడు.
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తిలోని గాంధీ రోడ్డులో మద్యం మత్తులో మంగళవారం ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ట్యూషన్ వెళుతున్న 14 ఏళ్ల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వెలికి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని భయంతో పరుగులు తీసింది.
విషయం తెలుసుకున్న స్థానికులు మందుబాబుకి దేహశుద్ధి చేశారు. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.