
సూర్యగ్రహణంతో భూకంపాలు.. సునామీలు
సుదీర్ఘంగా గ్రహణం ఏర్పడటం వల్ల ఉపరి తలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తగ్గుతాయని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా తగ్గినప్పుడు ఆయా ప్రాంతాల్లో టోర్నడోలు, భూకంపాలు, సునామీలకు ఆస్కారం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా తదితర ప్రాంతాల్లో పగటిపూట ఏర్పడటం వల్ల మనదేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదని రిటైర్డ్ వాతావరణ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అంతేగాక ఈ సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఉండబోదన్నారు.
అందువల్ల పుకార్లను నమ్మవద్దని సూచించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌లపైనే ఉండే అవకాశముం దన్నారు. ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం మళ్లీ 2,500 సంవత్సరంలోనే ఏర్పడుతుందన్నారు. సోమవారం ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం మనుషులు, జంతువులు, వాతావరణంపై ఎలా ఉంటుందోనని నాసా పరిశోధనలు చేస్తోంద న్నారు. ఇప్పటికే అమెరికాలో సూర్యగ్రహణ ప్రభావంతో టోర్నడోల ప్రభావం మొదలైందని చెప్పారు.