
పొన్నాలపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్న ఆనందంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అత్యుత్సాహం ఆయనకు చేటు తెచ్చిపెట్టింది.
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్న ఆనందంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అత్యుత్సాహం ఆయనకు చేటు తెచ్చిపెట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న విషయాన్ని మర్చిపోయారో ఏమో గానీ, ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన పొన్నాల లక్ష్మయ్య.. అక్కడినుంచి భారీ ఊరేగింపుగా వరంగల్ జిల్లాకు వెళ్లారు.
అయితే కోడ్ అమలులో ఉన్నప్పుడు కాన్వాయ్ తీసుకెళ్లడం, ఇలాంటి ఊరేగింపులు నిర్వహించడం నిషేధం. దాంతో పొన్నాల లక్ష్మయ్య మీద ఎన్నికల నిబంధనలను అతిక్రమించినందుకుగాను కేసు నమోదైంది. దాంతో పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్న సంబరం కాస్తా ఆవిరైనట్లు అయిపోయింది.