విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్రగాయాలు | Electric shock young man Severe injuries | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్రగాయాలు

Published Wed, Oct 16 2013 4:30 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Electric shock young man Severe injuries

 జనగామ క్రైం, న్యూస్‌లైన్ : జనగామ రైల్వేస్టేషన్‌లో మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు కథనం ప్రకారం.. రైల్వేస్టేషన్ వ్యాగిన్ పాయింట్ వద్ద సుమారు 35ఏళ్ల యువకుడు రైల్వే హైటెన్షన్ తీగలను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి అతడు ఒళ్లు 70 శాతం కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి.  స్ధాని కులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్సను అందించారు.
 
  సదరు యువకుడు తన పేరు ఉపేందర్ అని.. నల్లగొండ జిల్లా కోదాడ అని చెబుతున్నాడు. సదరు యువకుడు వైద్యానికి సహకరించడం లేదని స్థానిక వైద్య సిబ్బంది తెలిపారు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడా? లేక మతిస్ధిమితం లేక అలా ప్రవర్తించి ఉంటాడా? అన్న విషయం తెలియరాలేదు. జనగామ రైల్వేస్టేషన్‌లో పోలీసుల ఔట్‌పోస్టు లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement