ఇంజనీరింగ్ ప్రణాళిక సిద్ధం చేసిన సాంకేతిక విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను 50 రోజుల్లో పూర్తి చేయాలని సాంకేతిక విద్యాశాఖ తలపెట్టింది. వీలైతే 25 రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నా 50 రోజులకు మాత్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న చివరి రోజు నుంచి మొదలుకొని మొత్తం ప్రవేశాల ముగింపును 50 రోజుల్లో పూర్తి చేసేందుకు సిద్ధం అవుతోంది.
ఇదీ రోజువారీ ప్రణాళిక...
1వ రోజు : ఆప్షన్లు ఇవ్వడం ముగింపు
4వ రోజు : మెరిట్ జాబితాలు సిద్ధం చేయడం
5వ రోజు : మొదటి ప్రవేశాల జాబితా విడుదల
8 11వ రోజు : మొదటి జాబితాలోని విద్యార్థులకు ఇంటర్వ్యూ
12వ రోజు : రెండో ప్రవేశాల జాబితా వెల్లడి
14 17వ రోజు : రెండో జాబితాలోని వారికి ప్రవేశాలు
19వ రోజు : మూడో ప్రవేశాల జాబితా వెల్లడి
21 23వ రోజు : మూడో జాబితాలోని విద్యార్థులకు ప్రవేశాలు
24వ రోజు : నాలుగో ప్రవేశాల జాబితా విడుదల
26 28వ రోజు : నాలుగో జాబితాలోని విద్యార్థులకు ప్రవేశాలు
30వ రోజు : ఐదో ప్రవేశాల జాబితా విడుదల
32 33వ రోజు : ఐదో జాబితాలోని విద్యార్థులకు ఇంటర్వ్యూ
35వ రోజు : మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలు
50వ రోజు : {పవేశాలు ముగింపు
1.55 లక్షలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌కు మంగళవారం నాటికి 1,55,338 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. బాలురు 76,837 మంది కాగా, బాలికలు 78,501 మంది ఉన్నారు. అగ్రికల్చర్, మెడికల్‌కు 44,507 మంది దరఖాస్తు చేసుకోగా ఇంజనీరింగ్‌కు 1,10,114 మంది పోటీపడుతున్నారు. రెండింటికీ 721 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్వీ రమణారావు చెప్పారు. ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
50 రోజుల్లో ప్రవేశాలు పూర్తి!
Published Wed, Mar 19 2014 2:10 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement