గుంటూరు: తాడేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో నివసిస్తున్న రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చెన్నకేశ్వర్ ఇంట్లో బుధవారం వేకువజామున దొంగలుపడి ఇంట్లోనివారిని చితకబాది చోరీ చేశారు. పెరటివైపు నుంచి ఇంట్లోకి వచ్చిన నలుగురు దొంగలు చెన్నకేశ్వర్ దంపతులపై దాడిచేసి కొట్టి ఇంట్లో ఉన్న 20 సవర్ల బంగారు నగలు, 50 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. వృద్ధులు కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వెళ్లి విచారించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.