విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో శుక్రవారం గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం జరిగింది.
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో శుక్రవారం గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం జరిగింది. స్తానికంగా ఉండే బుద్ధ రామకృష్ణ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. అకస్మాత్తుగా ప్రమాదం మంటలు రావడంతో ఇంట్లోని వారంతా బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. సుమారు లక్ష రూపాయలకు పైగా ఆస్టినష్టం జరిగినట్టు అంచనా.