
అగ్నిప్రమాదంలో ఆరు బైక్‌లు దగ్ధం
అత్తిలి : అత్తిలిలోని ఓ మోటార్ మెకానిక్ షెడ్‌లో గురువారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరు బైక్‌లు దగ్ధమయ్యాయి. బస్‌స్టేషన్ పక్కనే ఉన్న ఎస్సీ కాంప్లెక్స్‌లో వెంకన్న పెచ్చెట్టి జయసింగ్‌లు మోటార్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నారు. రాత్రి షాపు మూసివేసి వెళ్లిపోయిన వారికి గురువారం తెల్లవారుఝామున మూడు గంటలకు షాపు నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే షాపులో ఉన్న ఆరు బైక్‌లు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. అత్తిలి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు రూ.రెండు లక్షల ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ చెప్పారు.