
సాక్షి, విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న అన్నదాన భవనంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అన్నదాన భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో అన్నదానానికి వినియోగించే ప్లేట్లు, గ్లాసులు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భవనంలో సిబ్బంది ఎవరూ లేనందున పెనుప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.