అసలేం తిన్నారు ? | Food Poisoning In KGBV School In East Godavari | Sakshi
Sakshi News home page

అసలేం తిన్నారు ?

Published Sat, Jul 6 2019 10:20 AM | Last Updated on Sat, Jul 6 2019 10:20 AM

Food Poisoning In KGBV School In East Godavari - Sakshi

విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఐఓ మల్లిక్‌ 

సాక్షి, కూనవరం (తూర్పుగోదావరి) : కస్తూర్భాగాంధీ పాఠశాలలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురై సమీప ఆస్పత్రిలో చేరిన సంఘటనపై శుక్రవారం జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి(డీఐఓ) డాక్టర్‌ మల్లిక్‌ విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ ఆహారానికి ముందు ఏమేమి తిన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆలూకర్రి, పప్పు, రసం, కోడిగుడ్డు, పెరుగు, అరటి పండు, సాయంత్రం ఐదు గంటలకు సేమ్యాకేసరి తిన్నట్టు వివరించారు. అనంతరం పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. అది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి తక్షణం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్వోప్లాంట్‌ పనిచేయక పోవడంతో బయట నుంచి తెచ్చిన మినరల్‌ వాటర్‌ను డ్రమ్ములో పోసి వాడడం మూలంగా కలుషితమైందా?, లేక అన్నం సక్రమంగా వండకపోవడం కారణమా? వంటి విషయాలను పరిశీలించారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీఓకి అందజేయనున్నట్టు తెలిపారు. 

వైద్యశిబిరం ఏర్పాటు 
కేజీబీవీ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 189 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు రక్తనమూనాలు సేకరించినట్టు డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి నీలిమా, డాక్టర్‌ మోహన్, కూటూరు వైద్యాధికారి శివకృష్ణారెడ్డి వైద్యశిబిరంలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పరామర్శ
కేజీబీవీ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన బాలికలను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి దీకొండ గంగాధర్, వైఎస్‌ ఎంపీపీ గుజ్జా బాబు, సరియం రామకృష్ణ, నోముల కొండరావు, పాపారావు ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థినులను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పాఠశాల స్పెషలాఫీసర్‌తో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కూనవరం (రంపచోడవరం): కస్తూర్భాగాంధీ పాఠశాలలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురై సమీప ఆస్పత్రిలో చేరిన సంఘటనపై శుక్రవారం జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి(డీఐఓ) డాక్టర్‌ మల్లిక్‌ విచారణ చేపట్టారు.

ఆస్పత్రిలో కోలుకుంటున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ ఆహారానికి ముందు ఏమేమి తిన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆలూకర్రి, పప్పు, రసం, కోడిగుడ్డు, పెరుగు, అరటి పండు, సాయంత్రం ఐదు గంటలకు సేమ్యాకేసరి తిన్నట్టు వివరించారు. అనంతరం పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. అది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి తక్షణం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్వోప్లాంట్‌ పనిచేయక పోవడంతో బయట నుంచి తెచ్చిన మినరల్‌ వాటర్‌ను డ్రమ్ములో పోసి వాడడం మూలంగా కలుషితమైందా?, లేక అన్నం సక్రమంగా వండకపోవడం కారణమా? వంటి విషయాలను పరిశీలించారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీఓకి అందజేయనున్నట్టు తెలిపారు. 

వైద్యశిబిరం ఏర్పాటు 
కేజీబీవీ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 189 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు రక్తనమూనాలు సేకరించినట్టు డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి నీలిమా, డాక్టర్‌ మోహన్, కూటూరు వైద్యాధికారి శివకృష్ణారెడ్డి వైద్యశిబిరంలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల పరామర్శ
కేజీబీవీ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన బాలికలను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి దీకొండ గంగాధర్, వైఎస్‌ ఎంపీపీ గుజ్జా బాబు, సరియం రామకృష్ణ, నోముల కొండరావు, పాపారావు ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థినులను పరామర్శించారు. 
వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పాఠశాల స్పెషలాఫీసర్‌తో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement