kasthurba gandhi girls school
-
‘విద్యా రంగానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు’
సాక్షి, కామారెడ్డి : విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి సబిత పాల్గొన్నారు. బీటీఎస్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో 2 కోట్ల 95 లక్షలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు పాఠశాల దాత తిమ్మారెడ్డి సుభాష్ రెడ్డి సొంత ఖర్చులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మనసున్న మనిషిగా పాఠశాల నిర్మాణానికి ముందుకు వచ్చిన సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని చెప్పారు. చదవండి: ఆగ్రహం: మంత్రి సబితకు నిరసన సెగ కరోనా లాక్ డౌన్ సమయంలో రైతాంగం, విద్యారంగాలపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. రైతు పండించిన పంటని ఇంటికి తీసుకురావడంతో పాటు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశారన్నారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా విద్యాబోధన కొనసాగుతోందని, ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే విద్యాబోధన అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని వివరించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రతి రంగంలో కామారెడ్డి నియోజకవర్గం ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు -
సమస్యను వారంలో పరిష్కరిస్తాం
కొణిజర్ల: ఏన్కూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను వారంరోజుల్లో పరిష్కరిస్తానని జిల్లా విద్యాశాఖాధికారి పి.మదన్మోహన్ అన్నారు. బాలికలు సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గ్రహించిన డీఈఓ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాలికల మరుగుదొడ్లు, నీటి వసతులను ఆయన పరిశీలించారు. బాలికలతో మాట్లాడారు. వంట శాల పరిశీలించి బాలికలకు అమలు చేస్తున్న మెనూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏన్కూర్ కస్తూర్బాలో బాలికల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని వినియోగంలో లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని వారం రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పాఠశాలలో సమస్యలపై టీఎస్ ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ విభాగానికి తెలియజేశామని, వారు పాఠశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 471 వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని, వారిలో గతేడాది పని చేసిన 413 మందిని రెన్యూవల్ చేసినట్లు చెప్పారు. పిల్లల సంఖ్యను బట్టి ఎంఈఓల నుంచి నివేదిక తెప్పించుకుని ఖాళీలను భర్తీ చేస్తామని, ఈ ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ తరగుతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా 9 పాఠశాలల్లో సిబ్బంది నియామకాలు చేపడుతున్నామన్నారు. ఇంటర్లో బాలికలు అదనంగా వచ్చి చేరడం వల్ల సమస్య ఏర్పడుతుందని, ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడం కోసం విద్యార్థులను ఏ బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా చేసి చదివిస్తామని, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేకంగా మెటీరియల్ తయారు చేయించి పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8,500 మంది విద్యార్థులు చేరారని, ఎక్కడ మౌలిక వసతుల కొరత ఉందో అక్కడ నిధులు కేటాయించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంఈఓ జయరాజు, ఎస్ఓ సంతు పాల్గొన్నారు. -
అసలేం తిన్నారు ?
సాక్షి, కూనవరం (తూర్పుగోదావరి) : కస్తూర్భాగాంధీ పాఠశాలలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురై సమీప ఆస్పత్రిలో చేరిన సంఘటనపై శుక్రవారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి(డీఐఓ) డాక్టర్ మల్లిక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ ఆహారానికి ముందు ఏమేమి తిన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆలూకర్రి, పప్పు, రసం, కోడిగుడ్డు, పెరుగు, అరటి పండు, సాయంత్రం ఐదు గంటలకు సేమ్యాకేసరి తిన్నట్టు వివరించారు. అనంతరం పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. అది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి తక్షణం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్వోప్లాంట్ పనిచేయక పోవడంతో బయట నుంచి తెచ్చిన మినరల్ వాటర్‌ను డ్రమ్ములో పోసి వాడడం మూలంగా కలుషితమైందా?, లేక అన్నం సక్రమంగా వండకపోవడం కారణమా? వంటి విషయాలను పరిశీలించారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీఓకి అందజేయనున్నట్టు తెలిపారు. వైద్యశిబిరం ఏర్పాటు కేజీబీవీ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 189 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు రక్తనమూనాలు సేకరించినట్టు డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి నీలిమా, డాక్టర్ మోహన్, కూటూరు వైద్యాధికారి శివకృష్ణారెడ్డి వైద్యశిబిరంలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ కేజీబీవీ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన బాలికలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి దీకొండ గంగాధర్, వైఎస్ ఎంపీపీ గుజ్జా బాబు, సరియం రామకృష్ణ, నోముల కొండరావు, పాపారావు ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థినులను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పాఠశాల స్పెషలాఫీసర్‌తో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కూనవరం (రంపచోడవరం): కస్తూర్భాగాంధీ పాఠశాలలో గురువారం రాత్రి కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురై సమీప ఆస్పత్రిలో చేరిన సంఘటనపై శుక్రవారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి(డీఐఓ) డాక్టర్ మల్లిక్ విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడుతూ ఆహారానికి ముందు ఏమేమి తిన్నారని ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆలూకర్రి, పప్పు, రసం, కోడిగుడ్డు, పెరుగు, అరటి పండు, సాయంత్రం ఐదు గంటలకు సేమ్యాకేసరి తిన్నట్టు వివరించారు. అనంతరం పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. అది అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి తక్షణం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్వోప్లాంట్ పనిచేయక పోవడంతో బయట నుంచి తెచ్చిన మినరల్ వాటర్‌ను డ్రమ్ములో పోసి వాడడం మూలంగా కలుషితమైందా?, లేక అన్నం సక్రమంగా వండకపోవడం కారణమా? వంటి విషయాలను పరిశీలించారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీఓకి అందజేయనున్నట్టు తెలిపారు. వైద్యశిబిరం ఏర్పాటు కేజీబీవీ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 189 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు రక్తనమూనాలు సేకరించినట్టు డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి నీలిమా, డాక్టర్ మోహన్, కూటూరు వైద్యాధికారి శివకృష్ణారెడ్డి వైద్యశిబిరంలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ కేజీబీవీ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన బాలికలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, జిల్లా కార్యదర్శి దీకొండ గంగాధర్, వైఎస్ ఎంపీపీ గుజ్జా బాబు, సరియం రామకృష్ణ, నోముల కొండరావు, పాపారావు ఆస్పత్రికి వెళ్లి బాధిత విద్యార్థినులను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పాఠశాల స్పెషలాఫీసర్‌తో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
దిశ మారింది దశ తిరిగింది
ఆర్థిక పరిస్థితులు.. కుటుంబ కారణాలుఆ పిల్లలను విద్యకు దూరం చేశాయి. పేదరికం బడిమానిపించేసింది. కొందరినైతే బడిముఖం కూడా చూడనివ్వలేదు. ‘ఆడపిల్లకు చదువెందుకు’ అంటూ సమాజం వెక్కిరించింది. ఇలాంటి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నాయి కస్తూర్బా పాఠశాలలు. బడి బయట పిల్లల కు విద్యనందించడమే ధ్యేయంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పాఠశాలలు మొదలయ్యాయి. ఇక్కడ అవకాశాలను అందిపుచ్చుకున్న బాలికలు చదువులో అదరగొడుతున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ముందుకు సాగుతున్నారు.చదువుతోపాటు కళలు, ఇతర ఉపాధి కోర్సుల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అచ్యుతాపురం(యలమంచిలి) :జిల్లాలో 34 కస్తూర్బా పాఠశాలలున్నాయి. ఒక్కొక్క పాఠశాలలో 200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడిమానేసినవారు, తండ్రి చనిపోయి తల్లిపోషణలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాల్లో పిల్లలకు ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రాధాన్యమిచ్చారు. వికలాంగులైన పిల్లలు, తల్లిదండ్రులు వికలాంగులై ఉండి.. ఆడపిల్లని పోషించుకోలేని పరిస్థితి ఉన్నవారికి కూడా ఈ పాఠశాలల్లో సీట్లు కేటాయించారు. ఇలాంటి పిల్లలు కస్తూర్బా పాఠశాలల్లో అడుగుపెట్టారు. ఆశయాల సాధనకు కృషి చేస్తున్నారు. చదువుల్లో తాము ఎవరికీ తక్కువ కాదనే విషయాన్ని పదోతరగతి ఫలితాల్లో 10/10 సాధించి.. నిరూపించారు. రెట్టించిన ఉత్సాహంతో ఉన్నత చదువుల దిశగా ముందుకు సాగుతున్నారు. విద్యతో పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా వివిధ కోర్సులను వీరికి నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీరికాళ్లపై వీరు నిలబడేలా ప్రోత్సహిస్తున్నారు. నిర్వాహకులు ఖాళీసమయాల్లో వివిధ అంశాలను నేర్పించేందుకు దృష్టి సారిం చారు. కూచిపూడి నృత్యం, కరాటే, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, జానపద కళలు, వివిధ క్రీడల్లో ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వాటిలో కూడా ప్రతిభ చూపి శభాష్ అనిపించుకున్నారు. తల్లిదండ్రులు వీరి ప్రతిభాపాటవాలు చూసి ‘మా పిల్లలలేనా..’ అంటూ మురిసిపోయేలా తీర్చిదిద్దారు. ప్రణాళికాబద్ధంగా... జిల్లాలోని అన్ని కస్తూర్బా పాఠశాలల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదివించారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, డిజిటల్ తరగతులతో అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మెలకువలను బోధించారు. అవన్నీ విద్యార్థుల ప్రగతికి దోహదపడ్డాయి. కరాటే, యోగా శిక్షణలో రాణించారు... కస్తూర్బా బాలికల పాఠశాలల్లో విద్యతోపాటు కరాటే, యోగా, వివిధ సాంస్కృతిక అంశాలపై శిక్షణ అందించారు. విద్యార్థుల సమయం వృధా కాకూడదని ప్రత్యేక శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పఠనా సామగ్రి, ఇన్వెర్టర్, కంప్యూటర్లను అందజేసి ప్రోత్సహిస్తున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకొని బాలికలు తమ సత్తాచాటుతున్నారు. ప్రతిభ చూపారు.. ఇక్కడ విద్యనభ్యసించిన బాలికలు పదోతరగతి పరీక్షల్లో 10/10 పాయింట్లు సాధించి సత్తాచాటారు. విద్యార్థినులకు విద్యపట్ల ఉన్న ఆసక్తి మంచి ఫలితాలకు దోహదపడుతోంది. ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికా బద్ధంగా చదివిస్తున్నాం. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పాఠశాలల అభివృద్ధికి సహాయం అందిస్తున్నారు. ఇంటర్ చదివే అవకాశం కూడా కొన్ని కస్తూర్బా పాఠశాలల్లో ఏర్పాటు చేశాం. ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించాం.– వి.భారతి ఎస్ఓ అచ్యుతాపురం కేజీబీవీ ఆసక్తితో ముందుకు... ఇళ్లకు వెళ్తే ఏదో ఒక పనిలో పెడతారనే భయం పిల్లల్లో ఉంది. ఏదైనా నేర్చుకునే ఆసక్తి బాగా కనబడింది. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకున్నారు. కరాటే, యోగా, భరతనాట్యంలో ప్రతిభ చూపారు. విద్యతోపాటు ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. ఖాళీ సమయాన్ని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అల్లికలు నేర్పేందుకు ఇక్కడి సిబ్బంది చొరవచూపుతున్నారు. చదువు పూర్తయిన తరువాత ఉపాధి అవకాశం పొందేలా ప్రోత్సహిస్తున్నారు. – దేవరాయల్, ఎంఈఓ, అచ్యుతాపురం -
బాలికలకు భరోసా
ప్రకాశం, మార్కాపురం: గ్రామీణ ప్రాంతాలకు చెందిన బడి ఈడు పిల్లలకు, బడి మానేసిన బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయాలు (కేజీబీవీలు) వారి పాలిట వరంగా మారాయి. 2007 నవంబర్ 14న జిల్లాలో 37 కస్తూరిబా పాఠశాలలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మార్కాపురం మండలం రాయవరం వద్ద కస్తూరిబా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేశారు. కస్తూరిబా పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి బాలికల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. ఈ నెల 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బడి మానేసిన, బడి ఈడు పిల్లలను ఉపాధ్యాయులు సర్వే నిర్వహించి గుర్తిస్తుంటారు. వారిలో బాలికలను సమీప గురుకుల విద్యాలయాల్లో చేర్పించాలని ప్రత్యేక అధికారులకు సర్వే నివేదికలు అందాయి. కస్తూరిబా పాఠశాలల్లో ఇవీ ప్రత్యేకతలు... కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయాల్లో బాలికలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి అందిస్తుంటారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, పెట్టెలు ఉచితంగా అందజేస్తారు. అలాగే కాస్మోటిక్ కిట్లను అందజేస్తారు. రోజూ ఉదయం పాలతో పాటు టిఫిన్, సాయంత్రం చిరుతిళ్లు, గురు, శనివారాల్లో తీపి పదార్థాలు, శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో కోడిగుడ్డుతో తయారు చేసిన కర్రీ ఇస్తారు. ప్రస్తుతం 6వ తరగతిలో ప్రవేశం పొందితే 10వ తరగతి వరకు చదువుకోవచ్చు. ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెడితే అదనంగా మరో రెండేళ్లు చదువుకోవచ్చు. ప్రాధాన్యత ప్రకారం ఎంపిక... కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మొదట బడిమానేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వారికి ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాలలో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. జిల్లాలో మార్కాపురం డివిజన్లోని రాయవరం, బేస్తవారిపేట, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, అర్ధవీడు, గిద్దలూరు, కొమరోలు, కొనకనమిట్ల, పుల్లలచెరువు, పెద్దదోర్నాల, పెద్దారవీడు, రాచర్ల, తర్లుపాడు, పొదిలి, కందుకూరు డివిజన్లోని సీఎస్ పురం, హెచ్ఎం పాడు, దర్శి, దొనకొండ, కురిచేడు, లింగసముద్రం, పామూరు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, జరుగుమల్లి, పొన్నలూరు, కందుకూరు, కనిగిరి, మర్రిపూడి, ముండ్లమూరు, చీరాల డివిజన్లోని చిన్నగంజాం, సంతమాగులూరు, చీరాల, దర్శి, కొత్తపట్నం, తదితర ప్రాంతాల్లో కేజీబీవీలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచికొన్నిచోట్ల ఇంటర్ కోర్సులు... ఈ ఏడాది నుంచి జిల్లాలోని మార్కాపురం, పుల్లలచెరువు, పెద్దారవీడు, హెచ్ఎం పాడు, బల్లికురవ, కురిచేడు, చినగంజాం, వలేటివారిపాలెం, కొమరోలు కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ కోర్సులు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నాణ్యమైన విద్య అందిస్తున్నాం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బాలికలకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. మంచి భోజన వసతి ఉంది. విద్యార్థి ఆధార్ నంబర్లు, తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. క్రీడలపై శిక్షణ ఇస్తున్నాం. వ్యర్థ వస్తువులతో వివిధ రకాల ఆకృతులు తయారు చేసే విధానంపై శిక్షణ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ ప్రారంభిస్తున్నాం.– విజయలక్ష్మి, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి -
‘కస్తూర్బా’.. పేద విద్యార్థినులకు వరం
గుంటూరు, సత్తెనపల్లి: బడి ఈడు పిల్లలందరికీ విద్యనందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం విద్యాశాఖ సమగ్రశిక్షా అభియాన్ ద్వారా పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. అనేక కారణాల వల్ల చాలా మంది 11 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. వారిలో అధిక శాతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలే. వారికి రెసిడెన్షియల్ పద్దతిలో ఆరు నుంచి పదో తరగతి వరకు గుణాత్మక విద్యను అందించడానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీటిని మన రాష్ట్రంలో 2005 ఆగస్ట్14న ప్రారంభించారు. బాలికల అక్షరాస్యతా శాతం, రాష్ట్ర అక్షరాస్యతా శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 352 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా, మన జిల్లాలో 24 ఉన్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన కేజీబీవీలు నేడు వేలాది మంది విద్యార్థినిలకు ఉచితంగా విద్యనందిస్తున్నాయి. గతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యనందించేవారు. ప్రస్తుతం జిల్లాలోని నాదెండ్ల, బెల్లంకొండ కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యనందిస్తున్నాయి. కొన్ని విద్యాలయాల్లో ఆంగ్ల మాద్యమంలోనే విద్య నందించడం విశేషం. విద్యతో పాటు కంప్యూటర్, ఆటలు, కరాటే, యోగ, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చి బాలికలోల ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు జిల్లాలో 24 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో మూడు మైనార్టీలకు కేటాయించారు. నరసరావుపేట, పిడుగురాళ్ల, పోతవరం (చిలకలూరిపేట) వీటిల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. నాదెండ్ల, బెల్లంకొండలో ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనందిస్తున్నారు. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, దాచేపల్లి, గురజాల, పిల్లుట్ల, రెంటచింతల, దుర్గి, మాచర్ల ,వెల్దుర్తి, కారంపూడి,రొంపిచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల, ఈపూరు, క్రోసూరు, అచ్చంపేట ప్రాంతాల్లో కేజీబీవీలు కొనసాగుతు న్నాయి. ఒక్కో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో తరగతికి 40 మంది చొప్పన 200 మంది చదువుతున్నారు. అలా 24 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో 4,800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నట్లు అంచనా. ప్రతి విద్యార్థినికి పౌష్టి కాహారాన్ని అందిస్తున్నారు. ప్రతి రోజూ గుడ్డు, వారానికి ఒకసారి కోడి మాంసాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఉచితంగా పుస్తకాలు, శుద్ధి చేసిన నీరు ఏర్పాటు చేశారు. బాలికల ఖర్చుల కోసం ప్రతి నెలా కాస్మోటిక్ చార్జీలు అందిస్తుంది. ప్రతినెలా వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను అంద జేస్తారు. ప్రతి కేజీబీవీలకు కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు కంప్యూటర్లో ప్రావీణ్యం పెంచేలా శిక్షణ ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు తెలిపారు. 7, 8 తరగతుల్లో ఖాళీలను మాత్రమే భర్తీ చేయనుండగా 6వ తరగతిలోకి కొత్తగా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి గల వారు మే ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థినుల పురోగతికి సోపానం కేజీబీవీలు పేద విద్యార్థినుల పురోగతికి సోపానాలు. ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. చదువుతో పాటు నాయకత్వ నైపుణ్యాలు, యోగ, ధ్యానం, కరాటే తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ ఉంటుంది. మే ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ లింక్ రానుంది. – బి.రాజ్యలక్ష్మి, డీసీడీఓ, గుంటూరు -
నిరుపేదలనే నిర్లక్ష్యమా...
విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మద్యలో బడిమానేసిన డ్రాపౌట్లు, నిరుపేద విద్యార్థినులకు కస్తూర్భా విద్యాలయాల్లో నాణ్యమైన విద్యతో పాటు సరైన వసతి ఉంటుందని భావించిన తల్లిదండ్రుల అంచనాలు తప్పాయి. అన్ని పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సంక్షేమం కోసం సర్వశిక్షా అభియాన్ రూ.కోట్లు ఖర్చు చేసి పక్కా భవనాలు నిర్మించినప్పటికీ సరైన వసతులు లేవు. ఫలితంగా బాలికలు సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంటూ నానా అవస్థలు పడుతున్నారు. మధ్యలో బడిమానేసి డ్రాపౌట్లుగా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో పేదవారైన ఆడపిల్లల కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కస్తూర్బా విద్యాలయాలను నెలకొల్పారు. పేద పిల్లల సంక్షేమం గురించి ఆలోచించి మంచి మౌలిక వసతులు కల్పించారు. అయితే నేటి పాలకులు ఆ విద్యాలయాల్లో చదువుతున్న బాలికల సంక్షేమాన్ని విస్మరిస్తూ కనీస సౌకర్యాల గురించి పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితాల్లో మేటిగా నిలుస్తున్నా... జిల్లాలో 33 కస్తూర్బా విద్యాలయాలు ఉండగా వాటిలో ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకు సుమారుగా 6,276 మంది బాలికలు చదువుతున్నారు. రామభద్రపురం మండలం బూసాయవలసలో గల పాఠశాలలో 200 మంది బాలికలు చదువుతున్నారు. జిల్లాలోని పిల్లలంతా చక్కనైన ఫలితాలు సాధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లోనూ మేటిగా నిలుస్తున్నారు. వివిధ పోటీల్లో పాల్గొని పాఠశాలలకు గుర్తింపు తీసుకువస్తున్నారు. కానీ వీరికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. చలికి గజగజ... విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే ఉద్దేశంతో ఊరిబయటే పాఠశాల భవనాలు నిర్మించారు. 15 రోజులుగా ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుండడం, నేలపై పడుకోవడంతో బాలికలు మరింతగా వణికిపోతున్నారు. ప్రభుత్వం దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేయకపోవడంతో విద్యార్ధినులు తమ ఇళ్ల నుంచి వాటిని తెచ్చుకొని వాడుకోవాల్సి వస్తోంది. ఇక బాత్ రూమ్‌లకు స్నానాలకు వెళితే జిల్లుమనే చల్లటి నీరు బాలికలను వణికిస్తోంది. సాధారణంగా సంక్షేమ పాఠశాలల్లో గ్రీజర్లు ఏర్పాటు చేయాలి. కాని కస్తూర్బా పాఠశాలల్లో వాటిని ఏర్పాటుచేయలేదు. గతేడాది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేశారు. అవి పాతబడినా ఈ ఏడాది కొంతవరకూ వాడుకోగలుగుతున్నారు. ఈ ఏడాది ఆరో తరగతిలో ప్రవేశాలు పొందిన బాలికలకు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పంపిణీ చేయలేదు. వారంతా చలికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను కస్తూర్బా పాఠశాలల్లో చేర్పిస్తే ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో తామే కొత్త దుçప్పట్లు కొని ఇస్తున్నామని చెబుతున్నారు. ఒక్క బాత్‌రూమ్‌కూ తలుపులేదు బూసాయవలస కస్తూర్బా పాఠశాలలో సరిపడా తరగతిగదులు లేక డార్మెటరీలనే తరగతి గదులుగా వాడుకుంటూ కిందనే కూర్చొని పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడ బాత్ రూమ్‌లకు ఒక్క దానికి కూడా తలుపులు లేక స్నానానికి వెళ్లడానికి సిగ్గుగా ఉందని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. చదువుకోవడానికి సరిపడా తరగతి గదులు లేవని, పరీక్షల సమయంలో డార్మిటరీలలో నేల కూర్చొని పరీక్షలు రాయాల్సి వస్తోందని, గంటల కొద్దీ నేలపైనే కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థినులు నిద్రపోవడానికి మంచాలు లేవు సరికదా కనీసం పరుచుకోవడానికి కార్పెట్‌లైన సకాలంలో ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కటిక నేలపై నిద్రపోతున్నారు.. ఇంటి నుంచి తెచ్చినవే వాడుకుంటున్నాం రాత్రి అయిందంటే చలికి వణికి పోతున్నాం. దుప్పట్లు, కార్పెట్లు ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకుని వాడుకుం టున్నాం. నేలపై పడుకుంటే చలి బాగా ఉంటోం ది. అలాగే ఈ కాలంలో రోజూ చల్లటి నీరు స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం దుప్పట్లు, కార్పెట్లు పంపిణీతో పాటు ఈ సీజన్లోనైనా వేడినీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటే మంచిది. – రెడ్డి స్వప్న, 6వ తరగతి, కస్తూర్బా పాఠశాల, బూసాయవలస చాలా ఇబ్బందులు పడుతున్నాం మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సుమారు ఏడాది కాలంగా బాత్రూమ్లకు తలుపులు లేకపోవడంతో అందులోకి వెళ్లాలంటేనే సిగ్గేస్తోంది. రోజూ నేలపై పడుకోవడం డార్మెటరీ లేక భోజనాలు చేస్తున్న గదిలోనే పడుకోవలసి వస్తోంది. అది కాస్త అసౌకర్యంగా ఉంటోంది. – మీసాల జ్యోత్స్న,విద్యార్థిని, కేజీబీవీ, బూసాయవలస కొత్తగా చేరిన వారికి ఇంకా రాలేదు గతేడాది విద్యార్థినులకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేశా. రెండేళ్లకోసారి పంపిణీ చేస్తాం. ఈ ఏడాది కొత్తగా చేరిన 6వ తరగతి బాలికలకు ఇంకా దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేయలేదు. ఎస్డీపీ ఆప్కో సంస్థకు అప్పగించారు. త్వరలో వస్తాయి పంపిణీ చేస్తాం. అలాగే సోలార్ వాటర్ హీటర్స్ ఏర్పాటు చేసేందుకు దాతల సహకారం కోరుతున్నాం.– డాక్టర్ బి.శ్రీనివాసరావు,ఎస్ఎస్ఏ పీవో, విజయనగరం -
కస్తూర్బాల్లో కష్టాల చదువు!
కర్నూలు, జూపాడుబంగ్లా: నిరుపేద బాలికలకు విద్యనందిస్తున్న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏడేళ్లు గడిచినా నేటికీ సరైన తరగతి గదుల్లేవు. డార్మెట్రీ, ల్యాబ్, లైబ్రేరీ, ఫ్యాన్లు, డెస్కులు వంటి వసతుల్లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 53 కస్తూర్బాగాంధీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 9,852 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగియవస్తున్నా దుప్పట్లు, కార్పెట్లు సరఫరా చేయలేదు. దీంతో చలికి విద్యార్థినులు వణికిపోతున్నారు. ఫ్యాన్లు తిరగకపోవటంతో దోమలకాటుకు గురైన విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి, మిడ్తూరు మండలాల్లో కస్తూర్భాగాంధీ పాఠశాలలుండగా వాటిల్లో 885 మంది విద్యార్థినులు అసౌకర్యాల మధ్యన విద్యను అభ్యసిస్తున్నారు. నేలబారు చదువులు జిల్లాలోని 45 కస్తూర్బా పాఠశాలల్లో చాలీచాలని గదులతో పాటు డార్మెట్రీల్లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యను అభ్యసించిన గదుల్లోనే రాత్రివేళ నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. అరకొరగా ఉన్న తరగతి గదుల్లో డెస్కుల్లేకపోవటంతో విద్యార్థినులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బండలపైనే కూర్చొని విద్యను అభ్యసిస్తుండటంతో విద్యార్థినులు అధికంగా వెన్నునొప్పి బారిన పడ్తున్నారు. అందని దుప్పట్లు ఈ ఏడాది విద్యాసంవత్సరం ముగియవస్తున్నా..కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థినులకు కప్పుకోవటానికి దుప్పట్లు, కిందపర్చుకోవటానికి కార్పెట్లు మంజూరు కాలేదు. విద్యార్థినులు తప్పనిసరైన పరిస్థితుల్లో ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకొన్నారు. తరగతి గదుల్లో ఉన్న ఫ్యాన్లు మరమ్మతులకు గురికాటంతో చలికి, దోమలదాటికి తట్టుకోలేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దోమకాటుకు గురైన విద్యార్థినులు విషజ్వరాల బారిన పడ్తున్నారు. జిల్లాలోని 17 కస్తూర్బాగాంధీ పాఠశాలలకు ప్రహారీల్లేవు. దీంతో తరగతిగదుల్లోంచి బయటకు వచ్చేందుకు విద్యార్థినులు జంకుతున్నారు. దీనికి తోడు ఆటస్థలాల్లేక విద్యార్థినులు ఆటలకుదూరమవుతున్నారు. సరైన బడ్జెట్ కేటాయింపు లేదు కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో కొంత మేర అసౌకార్యలున్న మాటవాస్తవమే. సరైన బడ్జెట్ లేకపోవటం వల్ల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించలేకపోతున్నాం. 17పాఠశాలలకు ప్రహారీలు మంజూరయ్యాయి. త్వరలో నిర్మింపజేస్తాం. మూడు పాఠశాలల్లో డార్మెట్రీల్లేవు. మరమ్మతులకు గురైన ఫ్యాన్లు వెంటనే మరమ్మత్తులు చేయించాలని సూచించాం. దుప్పట్లు త్వరలో పంపిణీ అయ్యేలా చేస్తాం. – నాగేశ్వరి, కస్తూర్బా పాఠశాలల డీసీడీఓ -
చెదిరిన నవ్వు..చెమర్చిన కళ్లు!
కర్నూలు ,ఆళ్లగడ్డ: ఇంటి దగ్గరయితే అమ్మ శుభ్రంగా స్నానం చేయించి...చక్కగా తలదువ్వి..దిష్టిచుక్క పెట్టి..బాగా చదువుకోవాలని పిల్లలను దీవించి పాఠశాలకు పంపుతుంది. హాస్టళ్లలో ఉండే బాలబాలికలకు ఈ పని ఎవరు చేయాలి? వారి వ్యక్తిగత శుభ్రతకు ఎవరు హామీ ఇవ్వాలి? ఈ ప్రశ్నలకు ఎవరినడిగినా ప్రభుత్వమే అని సమాధానం వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఈ పని చేయడం లేదు. కాస్మోటిక్ చార్జీలు చెల్లించకుండా..కిట్లు ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. చెదిరిన నవ్వుతో..చెమర్చిన కళ్లతో తరగతులకు హాజరవ్వడం విద్యార్థినుల వంతవుతోంది. కస్తూర్బా విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలందరూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలే. కాస్మోటిక్ చార్జీల కింద ఇచ్చే రూ. 100 వారి బ్యాంక్ అకౌంట్‌కు జమ అవుతోంది. ఆ మొత్తాన్ని తల్లిదండ్రులు వాడుకుంటున్నారని, విద్యార్థినులు కనీస అవసరాలకు సరిపడా వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థినులకు అవసరమైన కాస్మోటిక్ వస్తువులు అన్నీ కొనుగోలు చేసి ప్రతి మూడు నెలనెలకోసారి నేరుగా కిట్లను సరఫరా చేస్తామని ప్రకటించింది. గత విద్యాసంవత్సరం మార్చినుంచి కిట్ల పంపిణి మొదలు పెట్టింది. మార్చి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 53 కస్తూర్బా విద్యాలయాలకు ఒక్కో పాఠశాలకు ఒక్క సారి మాత్రమే సరఫరా చేశారు. కిట్లను సరఫరా చేసినప్పుడు వాటిని చూసిన బాలికలు ఎంతో ఆనంద పడ్డారు. అయితే వారి ఆశలు ఎన్నో రోజులు కొనసాగలేదు. ఒక్కసారి సరఫరా చేసిన ప్రభుత్వం అటు తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమై ఆరునెలలు కావస్తున్నా ఇంతవరకు కిట్లు కాని కాస్మోటిక్ చార్జీలు కాని ఇవ్వడం లేదు. కిట్స్‌లో ఉండాల్సిన వస్తువులివే... స్నానపు సబ్బులు 6, దుస్తులు ఉతికే సబ్బులు 4, కొబ్బెరనూనె సీసీ 1, డెటాల్ 1, బాడీలోషన్ 1, డిజర్జంట్ పొడి 1, దువ్వెన, పౌడర్ డబ్బా, టూత్ పేస్టు, బ్రష్, టంగ్ క్లీనర్, ప్లాస్టిక్ దువ్వెన, బొట్టు బిల్లలు, ష్యాంపు పాకెట్లు, నైలాన్ రిబ్బన్లు, హెయిర్బ్యాండ్లు, ఆలౌట్.. తదితర 15 రకాలు ఉంటాయి. ఇవీ ఇబ్బందులు.. కిట్లు అందక పోవడంతో విద్యార్థినులు చెదిరిన జుట్టు, మాసిన దుస్తులతోనే తరగతులకు హాజరవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి దాచుకున్న సొమ్మును బాలికలకు ఇస్తున్నారు. ఈ డబ్బుతో సబ్బులు, కొబ్బెరనూనె, పేస్టు తదిత వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ డబ్బులు కూడా లేని నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు తమ బాధను చెప్పులేక పోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం గతేడాది జనవరి నుంచి కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా కిట్స్ ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్లు ఒక్కో కేజీబీవీకి ఒక్కోసారి మాత్రమే సరఫరా చేశారు. తరవాత ఇవ్వలేదు. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.– నాగేశ్వరి, బాలికల సంరక్షణ అధికారి (జీసీడీఓ) ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం గత సంవత్సరం నుంచి కాస్మోటిక్స్ చార్జీలు చెల్లించడం లేదు. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కాస్మోటిక్ కిట్ ఇచ్చారు. అవీ అప్పుడే అయిపోయినాయి. అప్పటి నుంచి సబ్బులు, నూనె ఇతర వస్తువులు ఇంటిదగ్గర నుంచే తెచ్చుకుంటున్నా. – రజియాబీ, విద్యార్థిని దుస్తులు శుభ్రం చేసుకోవాలంటే ఇబ్బందులు పాఠశాలలో ఉండే వారందరమూ నిరుపేదలమే. కాస్మోటిక్ చార్జీలు కాని, కిట్లుగాని ఇవ్వక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా అమ్మనాన్నలు కూలి పనులకు వెళ్లి సంపాదించిన సొమ్ములతో నూనె ఇతర సామగ్రి కొనుగోలు చేసి పంపుతున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. సబ్బులు లేక ఉత్త నీళ్లతో ఉతుక్కుంటున్నాం. – మహేశ్వరి, విద్యార్థిని -
కస్తూర్బాలో ప్రవేశాలు ఎప్పుడు!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమై తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మాత్రం 6వ తరగతి ప్రవేశాలు ఇంకా మొదలు కాలేదు. పాఠశాలలు ప్రారంభించే వరకు ఎప్పటిలాగే ప్రవేశాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటేనే పరిశీలిస్తామని చెప్పడంతో నిరుపేద బాలికలు ఖంగుతున్నారు. ఎలాగోలా కష్టపడి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే ఇప్పటికి వరకు ప్రవేశాలు కల్పించకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. 29 కేజీబీవీల్లో... జిల్లావ్యాప్తంగా 29 కేజీబీవీల్లో 1118 సీట్లు ఉండగా 1246 దరఖాస్తులు వచ్చాయి. దీంతో తమకు సీట్లు వస్తాయో రావోనన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. దరఖాస్తులకు అనుగుణంగా సీట్లను పెంచుతారా లేక నిర్ణయించిన మేరకే ఆడ్మిషన్లను తీసుకుంటారా అనే సందిగ్ధం కొనసాగుతుంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్ది పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. ఇక్కడ సీటు వస్తే సరి లేకుంటే ఎక్కడికి వెళ్లి చేరాలని ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమయ్యే కొద్ది బయట ఉన్న పాఠశాలల్లో సిలబస్ సుమారుగా అయిపోయి ఉంటుందని కలవరపడుతున్నారు. అధికారులు స్పందించి కేజీబీవీల్లో అడ్మిషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వచ్చేవారం లోగా ప్రవేశాలు జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల కోసం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో పరిశీ లించి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రవేశాలు కల్పిస్తాం. ఈ పక్రియ వచ్చే వారం లోగా పూర్తి చేసే అవకాశం ఉంది. ముందుగా డ్రాపౌట్స్, తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రయారిటీ ఇస్తాం. తరువాత మిగిలిన వారికి సీట్లను కేటాయిస్తాం. – విజయ్‌కుమార్,ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారి -
బాలికలకు భరోసా
కరీంనగర్‌ఎడ్యుకేషన్: కస్తూరిబాగాంధీ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నైపుణ్యాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యాసనాభివృద్ధి(ఎల్ఈపీ)పేరుతో శుక్రవారం నుంచి వచ్చేనెల 12వరకు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని కేజీబీవీలు, ప్రభుత్వ, ఆదర్శ పాఠశాలల్లో చదువుల్లోని సామర్థ్యాలు, గణిత చతుర్విది ప్రక్రియల్లో వెనుకంజలో ఉన్న బాలికల కోసం గతేడాది నుంచి ఎంపిక చేసిన కేజీబీవీల్లో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎల్ఈపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెనకబడిన విద్యార్థినులకు.. చదువులో వెనకబడిన విద్యార్థినులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడనుంది. జిల్లాలోని కరీంనగర్ కేజీబీవీ పాఠశాలను ఈ కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. 11 కేజీబీవీలకు చెందిన 240 మంది విద్యార్థులను ఎంపిక చేసి వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. కేజీబీవీతో పాటు సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని 7,8,9 తరగతుల్లో చదువులో వెనుకబడిన బాలికలను ఎంపిక చేసి భోజనంతో పాటు ఇతర వసతులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 150మంది బాలికలు సైతం శిక్షణలో చేర్చుకోవాలని విద్యాశాఖ సూచించింది. 242 మందికి శిక్షణ... జిల్లాలోని 12 కస్తూరిబా పాఠశాలల్లో అభ్యాసనాభివృద్ధి కార్యక్రమం అమలవుతోంది. కొత్తగా ఏర్పడిన ఇల్లందకుంట మండలం మినహా 11 కేజీబీవీలకు చెందిన 242 మంది విద్యార్థులను నైపుణ్య శిక్షణాశిబిరానికి ఎంపిక చేశారు. వీరు ఇంటి నుంచి దుప్పట్లు , ఇతర సామగ్రి తెచ్చుకోవాల్సి ఉంటుంది. శిక్షణకాలంలో ఇక్కడే ఉచిత భోజనం, వసతిసౌకర్యం కల్పిస్తారు. ఈ విషయమై ఇప్పటికే ఉపాధ్యాయినులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చే అంశాలివే... బాలికలు తెలుగు, ఆంగ్ల విషయాలపై పట్టు సాధించేలా వ్యాకారణాంశాలు వివరిస్తారు. చదవడం, రాయడంతో పాటు గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చేస్తారు. స్వతహాగా వ్యాసం రాసే సామర్థ్యం, సైన్స్ సబ్జెక్టుల్లో శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానాన్ని పెంపొందింపజేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆత్మరక్షణకు దోహదపడే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. గణితంలో ప్రాథమిక అంశాలు, సూత్రాలు బోధిస్తున్నారు. గ్రంథాలయాల్లో పుస్తక పఠనంతో పాటు కంప్యూటర్ ప్రాథమిక అంశాలపై శిక్షణ ఉంటుంది. భవిష్యత్‌లో స్వయం ఉపాధికి దోహదపడే లా కుట్లు, అల్లికలు నేర్పిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలపై తర్ఫీదు ఇస్తున్నారు. క్రీడలు, యోగా, ధ్యానం, చిత్రలేఖనం, క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నారు. సామాజిక అంశాలపై విద్యార్థినులతో బృంద చర్చలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన డాక్యూమెంటరీలతో దృశ్యం రూపంలో ఆంగ్లం బోధిస్తున్నారు. ప్రతీరోజు విద్యార్థినులకు పరీక్ష నిర్వహించి, జవాబు పత్రాలను దిద్ది వారిలోని లోపాలు గమనిస్తున్నారు. ప్రతీ బాలికపై వ్యక్తిగత శ్రద్ధ వహించి వారిలోని లోపాలను అధిగమించేలా కృషి చేస్తున్నారు. శిక్షణ కార్యక్రమం ముగింపు రోజు బాలికలను ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. -
నిరుపేదలకు వరం ‘కస్తూర్బా’
నేరడిగొండ : చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా కొందరికి కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. మరికొందరికి ఆర్థిక స్థోమత సహకరించదు. ఎలాగోలా బడికి వెళ్తున్నా మధ్యలోనే మానేయాల్సిన దుర్భర పరిస్థితి మరికొందరిది. ఇలాంటి వారెందరినో అక్కున చేర్చుకొని అన్నివసతులు సమకూర్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు. కుటుంబ పరిస్థితులు అనుకూలించక, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు కేజీబీవీల వ్యవస్థ వరంలా మారింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో గ్రామాల్లో బాలికలను చదివించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఇలా మధ్యలో చదువు మానేసిన బాలికలు, తల్లిదండ్రులు లేని చిన్నారులను కస్తూర్భాలు అక్కున చేర్చుకొని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. నేరడిగొండ కేజీబీవీలో మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని 2010లో ప్రారంభించారు. అప్పటినుంచి ఎనిమిదేళ్లుగా ఎంతోమంది ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించి ప్రయోజకులు అయ్యారు. ప్రస్తుతం ఈ విద్యాలయంలో చదువుతున్న 182 మంది బాలికలది ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. పేదరికంతో బడి మానేసిన వారు ఒకరైతే, తల్లిదండ్రులను కోల్పోయి స్కూల్‌కు దూరమైన వారు మరొకరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుకోవాలన్నదే వారి ఆశ. చదవాలన్న వారి ఆసక్తికి అనుగుణంగా బాలికల బంగారు భవిష్యత్తుకు ఇక్కడి కస్తూర్భా విద్యాలయం బాటలు వేస్తోంది. భరోసా కలిగింది పాఠశాలల్లో వసతులు, విద్యబోధన బాగుంది. ఉపాధ్యాయులు కూడా ఇంటి వద్ద అమ్మానాన్నలు ఎలా చూసుకుంటారో అలాగే మాపట్ల శ్రద్ధ పెడుతున్నారు. చదువుకోవడానికి ఇంతకన్నా ఏంకావాలి. మంచిగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. – గాయత్రి, 9వతరగతి విద్యార్థిని బాగా చదివి స్థిరపడతా మాది లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామం. బాగా చది వి భవిష్యత్తులో స్థిరపడాల న్నదే నా లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తా. పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం యోగా కూడా నేర్పుతున్నారు. – శ్రీజ, పదోతరగతి విద్యార్థిని మంచి అవకాశం ఆర్థిక ఇబ్బందులు, ఇతర కార ణాలతో మధ్యలో చదువు మానేసిన బాలికలకు కస్తూర్భాలు ఎం తో దోహద పడుతున్నాయి. బా లికలు ఉన్నతవిద్య వైపు అడుగు లు వేస్తున్నారు. మంచి విద్య, క్రమశిక్షణతో పాటు ఆహారం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – జయశ్రీ, ఎస్వో -
బాలికలకు కానుక!
వనపర్తి/కొత్తకోట: కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న బాలికలకు కొత్త సంవత్సరం కానుకగా ప్రతి మూడు నెలలకోసారి కాస్మొటిక్ కిట్టును సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘ఆరోగ్య పరిరక్షణ కిట్’ పేరిట 15 రకాల వస్తువులు అందజేయనుంది. ఇప్పటి దాకా ప్రభుత్వం కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.వంద చెల్లిస్తుండగా.. ఇవి ఏ మూలకూ సరిపోయేది కాదు. అవి కూడా సక్రమంగా వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం కిట్లు ఇవ్వనుండడం, అందులో సబ్బులు, షాంపూలు, పౌడర్ లాంటి సౌందర్య సాధనాలతోపాటు నాప్యెన్లు కూడా ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ కిట్ల సరఫరా, పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా విద్యాశాఖకు అప్పగించింది. ఫిబ్రవరి మొదటి వారంలో.. ‘ఆరోగ్య పరిశుభ్రత కిట్’లో నాలుగు స్నానం సబ్బులు, రెండు దుస్తుల సబ్బులు, 24 శాంపులు, 175 మి.లీ. కొబ్బరి నూనె, 50 గ్రాముల పౌడర్, వంద గ్రాముల టూత్ పేస్ట్, టూత్ బ్రెష్, టంగ్ క్లీనర్, దువ్వెన, స్టిక్కర్లు (బొట్టు బిళ్లలు), రెండు 2.5 మీటర్ల నైలాన్ రిబ్బన్లు, రెండు హెయిర్ బాండ్లు, 18 నాప్ కిన్స్, ఒక మస్కిటో కాయిల్, హ్యాండ్‌వాష్ బాటిల్ (182 మి.లీ.) ఇలా 15 రకాల వస్తువులున్నాయి. మొట్టమొదటగా ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాలోని ఆయా కస్తూర్బాల్లో ‘ఆరోగ్య పరిశుభ్రత కిట్’లను అధికారులు అందజేశారు. కస్తూర్బాలతోపాటు మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లోని బాలికలకు సైతం ఈ కిట్లను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థినులకు మేలు వనపర్తి జిల్లాలో 15 కస్తూర్బా విద్యాలయాలున్నాయి. వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 2,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వసతి సౌకర్యం కూడా పొందుతున్న విద్యార్థినులకు ఇప్పటి వరకు ప్రతినెలా కాస్మొటిక్ చార్జీల పేరిట రూ.వంద చెల్లించేవారు. 2017 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు సైతం రాలేదు. విద్యార్థినులందరికీ బ్యాంకు ఖాతాలు లేదనే కారణంతో డబ్బు జమ చేయలేనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో విద్యార్థినులకు కొబ్బరి నూనె, సబ్బులు, బాడీ లోషన్స్ క్రిములు అత్యవసరం. కానీ డబ్బు రాకపోవడంతో చాలామంది కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆనందంగా ఉంది.. ఆరోగ్య పరిశుభ్రత కిట్‌లో ప్రతిరోజు ఉపయోగించే అన్ని రకాల వస్తువులున్నాయి. దువ్వెన నుంచి మేకప్ చేసుకునే వస్తువులు ఇచ్చారు. హాస్టల్లో ఉండే అందరికి ఈ వస్తువులు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఒకరి వస్తువులు మరొకరు వాడుకునే పరిస్థితి పోయింది. – స్వప్న, 9వ తరగతి, అమడబాకుల కేజీబీవీ నిరుపేద విద్యార్థులే అధికం.. కస్తూర్బాల్లో ఎక్కువగా తల్లిదండ్రులు లేని వారు, నిరుపేదలైన బాలికలే చదువుకుంటున్నారు. ప్రభుత్వం వారి అభ్యున్నతికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఆరోగ్య పరిశుభద్రత కిట్ ఇవ్వడం మరీ మంచిది. ఆడపిల్లలకు వీటి అవసరం చాలా ఉంటుంది. – శిరీష, ప్రిన్సిపాల్, అమడబాకుల, కేజీబీవీ -
జినుగుర్తి కేజీబీవీలో కలకలం!
తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తిగేటు సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలకలం రేగింది. ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన గురువారం అలస్యంగా వెలుగుచూసింది. వివరాలు...జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న కేజీబీవీలో ఏడో తరగతి చదువుతున్న అనూష, ఎనిమిదో తరగతి చదువుతున్న అనిత కాచిగూడలోని ఓ అనాథాశ్రమం నుంచి ఇటీవలే ఇక్కడికి వచ్చారు. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి ఇద్దరు విద్యార్థినులు తోటివారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలలోని గదిలో నిద్రకు ఉపక్రమించారు. బుధవారం తెల్లవారుజమున 5 గంటల సమయంలో విద్యార్థినులు కనబడలేరు. దీంతో పాఠశాల సిబ్బంది వారికోసం తరగతి గదులు, ఆవరణలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ విషయాన్ని పాఠశాల స్పెషల్ ఆఫీసర్ భావనికి తెలిపారు. ఆమె పోలీస్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని ఎస్ఐ రేణుకారెడ్ది దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినులు అదృశ్యమై రెండు రోజులు కావొస్తున్నా ఆచూకీ లేకపోవడంతో యాజమాన్యం, తోటి విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థినుల అదృశ్యంపై సర్వశిక్షా అభియాన్ ఏఎమ్ఓ రవి విచారణ జరిపారు. కేజీబీవీకి చేరుకొని విద్యార్థినులతో పాటు సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. సమగ్రంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం.. అదృశ్యమైన అనూష, అనితకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టాం. విద్యార్థినులిద్దరు అనాథలు కావడంతో వారి అచూకీ దొరకడం కష్టంగా మారింది. కాచీగూడ అనాథాశ్రమంలోనూ వారి గురించి వాకబు చేయగా అక్కడికి రాలేదని చెప్పారు. – వెంకటయ్య, ఎంఈఓ